Friday, March 29, 2024
- Advertisement -

ప్రియుడితో కలిసి భర్త హత్య కేసులో స్వాతికీ బెయిల్..పట్టించుకునేవారే లేక మహిళా సదన్ కి తరలింపు

- Advertisement -

అది అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన నేరవార్త. వామ్మో…ఇంత ఘోరమా ? ఇంత దారుణమా ? అని… ఆ క్రైమ్ న్యూస్ గురించి తెలిసి దేశమంతా షాక్ కి గురయ్యారు. ప్రియుడి మోజులో భర్తను ఓ భార్య అత్యంత కిరాతకంగా చంపేసింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నా…ఈ కేసు మాత్రం అత్యంత సంచలనం. ఊహకందని రీతిలో ఈ కేసులో ట్విస్టులు వెలుగుచూశాయి. నేరచరిత్రలోనే అదో అత్యంత అరుదైన కేసుగా రికార్డులకెక్కింది. ఆ కేసులో ముద్దాయికి ఇప్పడు బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె ఎక్కడుంది ? ఏం చేస్తోంది ?

గతేడాది నవంబర్ లో నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన హత్య కేసులో అత్యంత సంచలనం కలిగించే విషయాలను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సుధాకర్ రెడ్డిని అతడి భార్య స్వాతి, తన ప్రియుడు రాజేశ్ తో కలిసి అత్యంత దారుణంగా హతమార్చింది.
ప్రియుడితో కలిసి అర్ధరాత్రి భర్త సుధాకర్ రెడ్డిని చంపేసింది. తర్వాత అతడి మృతదేహాన్ని కారులో ఊరి చివర అటవీ ప్రాంతంలో పడేశారు. గ్యాస్ స్టవ్ వెలిగించి ప్రియుడి ముఖాన్ని ఆ స్టవ్ మంటల్లో కాల్చేసింది స్వాతి. ముకం మీద కాలిన గాయాలతో ఉన్న ప్రియుడు రాజేశ్ నే తన భర్త అని కుటుంబీకులకు చెప్పుకొచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా భర్త మీద యాసిడ్ దాడి చేసి పరారయ్యారు అని కన్నీరుపెట్టింది. కాలిన గాయాలతో ఉన్న ప్రియుడునే భర్త సుధాకర్ రెడ్డి అని చెప్పి అందరినీ నమ్మించింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించి, తన భర్త స్థానలో తిరిగి ఇంటికి తీసుకు వచ్చి హ్యాపీగా కాపురం చేసుకోవచ్చని భావించింది. కానీ ఆమె కుతంత్రం బయటపడిపోయింది. సుధాకర్ రెడ్డి స్థానంలో వేరే ఎవరో ఉన్నారు. ముకం మీద కాలిన గాయాలతో ఉన్నది సుధాకర్ రెడ్డి కాదు, వేరే వ్యక్తి అని, అతడి కుటుంబీకులతో పాటు పోలీసులు కని పెట్టేశారు. దీంతో తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో ఓ తెలుగు సీరియల్ చూసి అందులో చేసిన విధంగా తాను తన ప్రియుడు రాజేశ్ కలిసి ఈ నేరానికి పాల్పడినట్లు స్వాతి అంగీకరించింది. యాసిడ్ దాడి, ప్లాస్టిక్ సర్జరీ, భర్త స్థానంలో ప్రియుడు..ఇలా అనేక మలుపులుతో దర్యాప్తులో కళ్లు తిరిగే నిజాలు వెలుగుచూడటంంతో స్వాతి. రాజేశ్ జైలు పాలయ్యారు.

ఈ నేల 16న స్వాతికి బెయిల్ వచ్చింది. కానీ ఆమెకు పూచికత్తు ఇచ్చి తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. అత్తింటి వారు, పుట్టింటివారు మాకు సంబంధం లేదు అని తేల్చి వదిలేశారు. స్వాతి తండ్రి అయితే నా కూతురు ఎప్పుడో చనిపోయింది..అని పిండ ప్రధానం చేసి, గుండు చేయించుకుని తన ఆవేదనను దిగమింగుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మహబూబ్ నగర్ జైలు నుంచి బెయిల్ పై స్వాతి విడుదలైంది. అయితే ఆమె కుటుంబీకులు బెయిల్‌ ఇప్పించేందుకు నిరాకరించడంతో పాటు, వేరే వ్యక్తులు ఇప్పించిన బెయిల్ పైన ఆమె విడుదలైనా ఇంటికి తీసుకెళ్లడానికి ముందుకు రాలేదు. పైగా ఆమె విడుదల నేపథ్యంలో సుధాకర్ రెడ్డి బంధువులు కానీ, ఇతరులు కానీ ఆమెపై దాడి చేయవచ్చనే అనుమానంతో పోలీసులు ఆమెను హైదరాబాద్ లోని మహిళా సదనానికి తరలించాలని ప్రయత్నించారు. కానీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతానికి మహబూబ్‌నగర్‌ మహిళా సదనానికి తరలించారు. సుధాకర్ రెడ్డిని హత్య చేయడంలో స్వాతికి సహకరించిన ఆమె ప్రియుడు రాజేష్‌ ఇంకా జైలులోనే ఊచలు లెక్కిస్తున్నాడు.

అయితే బెయిల్ పై బయటకు వచ్చే ముందు స్వాతి జైలులో కన్నీరుమున్నీరైంది. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. ఇప్పటికే ఆమె జైలులో ఉన్నన్ని రోజుల్లో కూడా ఎవరూ ములాఖత్ కూడా తీసుకోలేదు. ఏ ఒక్కరూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. తోటి ఖైదీలతో కూడా మాట్లాడలేక స్వాతి మౌనంగా రోధించేదని పోలీసులు తెలిపారు. ఇప్పుడు పూర్తి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న స్వాతికి న్యాయవాదులు, జైలు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి బయటకు పంపించారు. ఆ సందర్భంగా అమె తన ఆరేళ్ల లోపు వయసున్న పిల్లల గురించి ఆడిగి కన్నీరు పెట్టుకుంది. వారిని చూడాలని ఉంది అని కంటతడి పెట్టింది. కానీ వాళ్లిద్దరూ తాతయ్య అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారని చెప్పడంతో కొంత వరకూ ఓదార్పు పొందినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -