ఆమ్మాయి పాలిట మృత్యువుగా మారిన పెళ్లి ప్లెక్సీ….

416
Tamilnadu :Woman Dies In Accident Caused By Illegal Banner
Tamilnadu :Woman Dies In Accident Caused By Illegal Banner

పల్లావరం సమీపంలో పెళ్లికి కట్టిన బ్యానర్ రూపంలో అమ్మాయి పాలిట మృత్యువుగా మారింది.వివాహ ఆహ్వానం పేరిట ఏర్పాటు చేసిన ఆ బ్యానర్‌ నేలకొరిగి స్కూటర్‌పై పడడంతో అదుపు తప్పి ఆ యువతి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ట్యాంకర్ అమ్మాయిపై నుంచి వెల్లడంతో మరణించింది.ఈ ఘటన తమిళనాడు, పల్లావరం సమీపంలోని పళ్లికరణై సమీపంలో జరిగింది

పల్లావరం రెడియల్‌ రోడ్డులో పళ్లికరణై వద్ద శుభశ్రీ అనే యువతి స్కూటర్‌ మీద వెళుతోంది. ఓ సంస్థలో పనిచేస్తున్న ఆమెను అక్కడ ఏర్పాటు చేసిన ఓ బ్యానర్‌ రూపంలో మృత్యువు కబళించింది.వివాహ ఆహ్వానం పేరిట మాజీ కౌన్సిలర్‌ ఒకరి కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌ నేలకొరిగింది. స్కూటర్‌ మీద బ్యానర్‌ పడడంతో అదుపు తప్పింది. స్కూటర్‌ నుంచి కింద పడ్డ శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతిచెందింది.

విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. ఆ ప్లెక్సీ ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని తేల్చారు. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర విమర్శలు చేశా

Loading...