Saturday, April 20, 2024
- Advertisement -

నా బయోపిక్ లో చరణ్ చేయొద్దు : చిరు షాకింగ్ కామెంట్స్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సైరా నరసింహరెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. రికార్డులు బద్దలు కొడుతుంది. తాజాగా ప్రమోషన్ లో బాగంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నా లైఫ్ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తే.. అందులో రామ్ చరణ్ నా పాత్రను చేయడానికి నేను ఆంగీకరించను. చరణ్ కాకుండా.. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. వీళ్లు కాకున్న అల్లు అర్జున్ చేసిన బాగుంటుందని చిరంజీవి తెలిపారు.

చరణ్ ను ఎందుకు నా పాత్రను పోషించొద్దు అనుకుంటున్నాను అంటే.. నా పాత్రను చెర్రీ పోషిస్తే, రాంచరణ్ జన్మించే సీన్‌లో రాంచరణ్ పట్టుకొంటే ప్రేక్షకులు నచ్చకపోవచ్చు. అది కథపై అంతగా వర్కవట్ కాదు. అందుకే చరణ్ వద్దు అనుకున్నా. చరణ్ నా పాత్ర పోషిస్తే కచ్చితంగా న్యాయం చేస్తాడు. అందులో డౌటే లేదు. కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల వద్దు అని అనుకుంటున్నానని చిరు అభిప్రాయపడ్డారు.

నేను వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో.. సాయి ధరమ్, వరుణ్, వైష్ణవ్ తేజ్ ఇప్పుడు అలానే కనిపిస్తారు. అభిమానులు కూడా అదే చెబుతున్నారు. అందుకే నా ఫ్యామిలీ హీరోలే నా బయోపిక్ లో నటించాలని అనుకుంటున్నానని చిరు తెలిపారు. బాహుబలి లాంటి సినిమా రాజమౌళి తెరకెక్కించడం వల్లే నేను సైరాకు సై అన్నాను. ఈ విషయంలో రాజమౌళికి థాంక్స్ చెప్పుకోవాలని చిరు చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -