Thursday, April 25, 2024
- Advertisement -

ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్.. ఏమైంది ?

- Advertisement -

స్టైలీష్ స్టార్ తన సినిమా మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్లీ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటివలే అల వైకుంఠపురములో సినిమాలోని ఓ సాంగ్ ను రిలీజ్ చేసారు. అది ఇప్పుడు యూట్యూబ్ ను దున్నేస్తోంది. అయితే అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి విషయాలు మాత్రమే కాకుండా పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మరో ఆసక్తికర విషయంను ఆయన ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నానని.. ’బ్లెస్సింగ్’ అనే పేరుతో కట్టుకుంటున్న ఈ ఇంటికి భూమి పూజ జరిపామని తన ఇస్టాగ్రామ్ లో ఒక ఫోటో ఫోస్ట్ చేశారు. ఈ ఫోటోలో అల్లు అర్జున్, స్నేహ.. పిల్లలు అయాన్, అర్హ లు ఉన్నారు. భూమి పూజా సందర్భంగా ఇటుకలపై తాపీతో తడి సిమెంటు వేస్తూ పోజిచ్చారు. అల్లు అర్జున్ కొంతకాం క్రితం తనకోసం ఓ స్పెషల్ ఆఫీస్ కట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త ఇంటి నిర్మాణం మొదలు పెట్టడంతో ఉమ్మడిగా ఉన్న అల్లు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి సపరేట్ గా ఉంటాడని అంటున్నారు.

అయితే ఈ మధ్య బన్నీ మెగా ప్యామిలీ కి దూరంగా ఉంటున్నాడనే రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి. సైరా సినిమా విషయంలో కూడా ఇలాంటి గాస్పిప్స్ వచ్చాయి. కాకుంటే ఇటీవలే సైరా సినిమా గురించి అల్లు అర్జున్ స్పందించి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇప్పుడు కొత్త ఇంటి నిర్మాణం అనగానే అల్లు అర్జున్ ఇప్పుడు తండ్రి అల్లు అరవింద్ నుంచి విడిపోయి కొత్త ఇల్లు కట్టుకోవడం అంత అవసరం ఏం వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -