Friday, April 19, 2024
- Advertisement -

బిగ్ బాస్ విన్నార్ రాహులే.. : పునర్నవి

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి రాహుల్ ఎలిమినేట్ అయ్యి వెంటనే మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఎలిమినేట్ అవుతాడా అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురు చూశారు. ఇక హౌస్ లో రాహుల్ మరియు పునర్నవి బాగా క్లోజ్ గా ఉండేవాళ్లు. పునర్నవి ఎలిమినేట్ కు ముందు రాహుల్ తో గొడవ పడింది. ఎలిమినేట్ రోజు కూడా రాహుల్ తో మాట్లాడలేదు. పునర్నవి ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతుందై రాహుల్ తెగ ఏడ్చాడు.

ఇక తాజాగా పునర్నవి కొన్ని మీడియా ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. రాహుల్ కి బయట ఉన్న క్రేజ్ చూసి పునర్నవి షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇంత క్రేజ్ ఉన్న విషయం తనకు తెలియదని చెప్పింది. ఈ విషయం రాహుల్ కి తెలిస్తే హౌస్ లో ఇంకా అద్భుతంగా గేమ్ ఆడుతాడని తెలిపింది. ఇక బిగ్ బాస్ ముగింపుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హోస్ట్ నాగార్జున తెలిపాడు. అయితే ఈ సారి ఎలిమినేషన్ జరిగి మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రాసెస్ ఉండదు. అయితే రాహుల్ కి, శ్రీముఖి కి, వరుణ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నార్ గా రాహుల్ ని చూడాలని పునర్నవి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -