Wednesday, April 24, 2024
- Advertisement -

వినోద్ ని జబర్దస్త్ నుంచి ఎందుకు తీసేశారంటే ?

- Advertisement -

జబర్దస్త్ షో ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. షో చేస్తునే సినిమాల్లో కూడా నటిస్తున్నారు. కొందరు చిన్న చిన్న వేశాలతో వచ్చి టీం లీడర్లుగా ఎదిగారు. అయితే ఇంత మందిలో లేడీ గేటప్ ద్వారా మాత్రం చాలా తక్కువ మంది ఫాపులర్ అయ్యారు.

అందులో ముందు ఉంటాడు వినోద్(వినోదిని). అయితే కొంత కాలం నుంచి వినోద్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందుకు గల కారణాలు చాలానే సోషల్ మీడియాలో వినిపించాయి. అందులో ప్రధానంగా 2019 ఎన్నికల సమయంలో జగన్ తరుపున వినోద్ ప్రచారం చేశాడని.. అందుకే అతన్ని జబర్దస్త్ నుంచి తీసేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది.  అయితే తాజాగా ఈ విషయంపై కమెడియన్ వినోద్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్నికల్లో జగన్ తరుపున ప్రచారం చేసినందుకు నన్ను జబర్దస్త్ నుంచి తీసేయలేదు.

ఆ టైంలో జబర్దస్త్ కు సరైన డేట్స్ ఇవ్వలేకపోయాను. అందుకే నన్ను జబర్దస్త్ నుంచి తీసేశారు. అంతకు మించి జబర్దస్త్ యూనిట్ తో నాకు ఎలాంటి గొడవలు లేవు.  అది కాకుండా ఓ గొడవ కారణంగా గాయపడటంతో కొంత రెస్ట్ అవసరం అయింది. అందుకే జబర్దస్త్ లో కనిపించడం లేదు. పూర్తిగా కోలుకుని.. త్వరలోనే జబర్దస్త్ లో కనిపించి మీ అందర్ని నవ్విస్తాను అని వినోద్ చెప్పుకొచ్చాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -