23న 23 మంది టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు వైసీపీలోకి జంప్‌…

1450
23 Tdp mla candidate jump into ysrcp on 23rd
23 Tdp mla candidate jump into ysrcp on 23rd

ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల‌తో రాష్ట్రరాజ‌కీయాల్లో మార్పులు శ‌ర వేగంగా చోట‌చేసుకుంటున్నాయి. అన్ని స‌ర్వే సంస్థ‌లు ఢిల్లీనుంచి గ‌ల్లీదాకా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని కోడై కూస్తున్నాయి. కొన్ని లోక‌ల్ స‌ర్వేలు మాత్రం టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్తున్నా పార్టీ నేత‌ల్లో ఆధీమా క‌నిపించ‌డంలేదు. స్వ‌యంగా బాబె పార్టీనేత‌ల్లో ధైర్యం నూరి పోస్తున్నా నేత‌లు మాత్రం ఓట‌మి భ‌యంలోనె ఉన్నారు.

టీడీపీ ఓడిపోతుంద‌ని ప‌రోక్షంగా తెలియ‌డంతో త‌మ భ‌విష్యుత్ రాజ‌కీయంపై పున‌రాలోచ‌న‌లో ప‌డినట్లు స‌మాచారం. టీడీపీ తురుపున పోటీ చేసిన 23 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్ధులు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్ప‌టికే ఆపార్టీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీ మారె నేతల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలతో పాటు ఓ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే వైసీపీ కీల‌క నేత‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. దీనికి కార‌ణం ఎగ్జిట్ పోల్స్‌.

ఇటీవల వెలువడిన ఫలితాల్లో మెజారిటీ సంస్థలు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీలోని కొందరు నేతలు ముందుగానే వైసీపీ నేతలతో మంతనాలు జరిపారనే వార్త రాష్ట్రంలో హాట్ టాపిక్ అవగా టీడీపీలో ఆందోళన కలిగిస్తోంది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు లేకపోవ‌డంతో వీరంతా జంప్ అవ్వటం ఖాయమని తెలుస్తుంది. అది కూడా ఫ‌లితాల‌రోజునె అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

Loading...