Tuesday, March 19, 2024
- Advertisement -

ఆరా స‌ర్వేలో ఏపీలో బంప‌ర్ మెజారిటీ వైసీపీ విజ‌య‌కేత‌నం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని ఆరా స‌ర్వే తేల్చి చెప్పింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫెక్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించిన ఆరా సంస్థ ఈసారి ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వేకు పూర్తి భిన్నంగా ఇచ్చింది. ఏపీలో వైసీపీ అధికారం చేప‌డుతుంద‌ని తెలిపింది.

ఆరా స‌ర్వే ప్ర‌కారం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 120స్థానాల్లో గెలవబోతుందని స్పష్టం చేశారు. ఇకపోతే అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 50 స్థానాల్లోనే విజయం సాధిస్తోందని స్పష్టం చేసింది.

లోక్ సభ ఫలితాల విషయానికి వస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు వస్తాయని తెలుగుదేశం పార్టీ కేవలం 5 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో స్పష్టం చేసింది. ఇకపోతే ఆరా సంస్థ 2009 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తోంది. అయితే లోక్ స‌భ స్థానాల్లో జ‌న‌సేన ఊసె లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

2019 శాసన సభ ఆరా ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:

వ.నం పార్టీ పేరు గెలిచేస్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

  1. తెలుగుదేశం 50 5
  2. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 5
  3. జనసేన పార్టీ 0 0

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్ల‌డించాయి.
లోక్ స‌భ స్థానాల ఎగ్జిట్ పోల‌స్‌..

వ.నం పార్టీ పేరు గెలిచే స్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం

  1. తెలుగుదేశం 5 0
  2. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 0
  3. జనసేన పార్టీ 0 0

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన పార్టీలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటి పడ్డాయి. అయితే గ‌తంలో వైసీపీ అత్య‌ధిక శాతం సీట్లు గెలుచుకుంటుంద‌ని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -