Saturday, April 20, 2024
- Advertisement -

బన్నీ బార్య స్నేహారెడ్డి కంటే ఉపాసన గ్రేట్ : నటి శ్రీరెడ్డి

- Advertisement -

సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బార్య ఉపాసన కొణిదెల, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి లకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరు తరుచుగా తమ లైఫ్ లో జరిగిన విషయాలను ఫ్యాన్స్ కు చెబుతుంటారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు వీరిద్దరిపై నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎప్పుడు వార్తల్లో ఉండాలనుకునే ఈమె తన ఫేస్ బుక్ లో ఇష్టానుసారం సెలబ్రిటీలపై, పెద్ద పెద్ద ఫ్యామిలీలపై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వారిపై మండిపడుతుంది.

ఉపాసన ఉన్నతమైన మహిళ అని పొగుడుతూనే స్నేహారెడ్డిని తీసిపారేసింది. స్నేహా రెడ్డి కంటే ఉపాసన గొప్ప వ్యక్తి అని.. ఉన్నతమైన మహిళ అని.. మిగిలిన వారంతా ఆమె పాదంపై దుమ్ముతో సమానమని వివాదాస్పద కామెంట్స్ చేసింది. ఈమేరకు ఫేస్ బుక్ లో తాజాగా ఒక పోస్టు పెట్టింది. అయితే గతంలో ఉపాసనపై శ్రీరెడ్డి పలుసార్లు ప్రశంసలు వర్షం కురిపించింది. సేవ కార్యక్రమాల్లో ముందు ఉంటూ.. పేదవారికి సాయం చేస్తూ ఉపాసన ఎంతో సేవ చేస్తోందని శ్రీరెడ్డి పేర్కొంది.

ఇప్పుడు కూడా అదే ప్రస్తావన తెచ్చి.. స్నేహారెడ్డిని తక్కువ చేస్తూ వివాదస్పద చర్చకు తెరలేపింది. అయితే శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్, స్నేహా ఫ్యాన్స్ మండిపడ్డారు. వారికి కూడా శ్రీరెడ్డి జవాబు ఇచ్చింది. “భయంకరమైన వ్యాధులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు. వారందరికి ఉపాసన సాయం చేస్తున్నారు. ఆమె ఎంతో మందికి రోల్ మోడల్, దేశం గర్వించదగిన మహిళ. స్నేహా మాత్రం తన రిచ్ కిడ్స్ ను మాత్రమే చూసుకుంటున్నారు” అని శ్రీరెడ్డి తెలిపింది. అలా అల్లు అర్జున్ భార్య స్నేహకు కోపం వచ్చేలా శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -