Tuesday, April 23, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్‌కు పరాభవం…రెండు చోట్ల ఘోర ఓట‌మి

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్ట‌న ప‌వ‌న్ చివ‌ర‌కు ప్ర‌శ్న‌గానె మిగిలిపోయారు. నేనె సీఎం అంటూ ప్ర‌క‌టించిన క‌నీసం ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేక‌పోయారు. ప‌వ‌న్ రెండు చోట్ల నుంచి పోటీచేశారు. గాజువాక‌, భీమ‌వ‌రం రెండు చోట్ల‌నుంచి పోటీ చేశారు. క‌నీసం ఒక్క స్థానంనుంచైనా గెలుస్తార‌ని పెట్టుకున్న పార్టీ అభిమానుల ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ పై 3,900 మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. భీమవరంలో అయినా గెలుస్తారని అభిమానులు ఎదురుచూశారు. అయితే చివరకు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కు ఓటమి తప్పదు. రెండు చోట్ల పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూడటం గమనార్హం.

రాష్ట్రం మొత్తం మీద ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడి స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ రౌండ్ రౌండ్‌కి ఫలితం తారుమారవుతుండటంతో ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ హవా జోరుగా వీస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -