Tuesday, March 19, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ఐర‌న్ లెగ్ …త‌ను పోతూ మిత్ర‌ప‌క్షాల‌ను ముంచేసిన బాబు

- Advertisement -

సొంత రాష్ట్రంలో గెల‌వ‌లేని చంబ్రాబు ఇప్పుడు ఢిల్లీలో చ‌క్రంతిప్పాల‌ని చూస్తున్న బాబుకు వాస్త‌వ ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఆంధ్రాలో టీడీపీ ఓడిపోతుంద‌ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేస్తున్నా బాబు మాత్రం విక్ర‌మార్కునిలాగా పోరాడుతున్నారు. ఎన్డీఏకు వ్య‌తిరేకంగా కేంద్రంలో యూపీఏతో ల‌సి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కాళ్లు అరిగేలా అన్ని రాష్ట్రాలు తిరిగారు. కాని ఏఫ‌లం చివ‌ర‌కు మ‌రో సారి ఎన్డీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేయ‌డంతో తాను మునిగి త‌న‌తోపాటు మిత్ర ప‌క్షాల‌ను కూడా ముంచార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాబుకు మొద‌టి నుంచి ఐర‌న్ లెగ్ అనే ముద్ర ఉండ‌నే ఉంది. ఇప్పుడు ఆ ఐర‌న్ లెగ్ తో మిత్ర‌ప‌క్షాల కొంప‌ముంచారు. బాబు గతంలో పదేళ్లపాటు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు రాష్ట్రం తీవ్రమైన కరువు కాటకాలతో అల్లాడింది. చంద్రబాబు పాలనలో తెలుగు గడ్డపై వర్షపు చుక్క అనేదే లేకుండా పోయింది.చెరువులు, నదులు, రిజర్వాయర్లు ఎండిపోయి. వ్య‌వ‌సాయం దండ‌గ అన్న గొప్ప మేధావి.

రాష్ట్ర విభజన తర్వాత బాబును నవ్యాంధ్రకు తొలి సీఎంగా అనుభవించాడని ఎన్నుకున్న ఐదేళ్లలో బాబు ఏపీకి ఒరగబెట్టింది శూన్యం. ఈ ఎన్నికల్లో బాబును మళ్లీ చిత్తు చిత్తుగా ఓడించి ఆయన పొలిటికల్ కెరీర్ కు దాదాపు పులిస్టాప్ పెట్టేయ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌న‌కు త‌ప్ప‌ద‌ని తెలిసి …..జాతీయ స్థాయిలో బీజేపీయేత‌ర ప‌క్షాల‌ను ఏకం చేస్తానంటూ ఢిల్లీలో నానా హ‌డావుడి చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోడీ పీఎం పీఠం ఎక్కకూడదని డిసైడ్ అయిన చంద్రబాబు కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త నాటకం ఆడాల‌ని చూస్తున్నా.. ఆయనను ఢిల్లీలో పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.

ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం చూస్తె యూపీలో ఎస్పి, బీఎస్పి మహాగట్ బంధ్ చిత్తుచిత్తు కానుంది. కర్ణాటకలో జేడిఎస్ ఖాతా తెరవడం కూడా కష్టం కానుంది. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ పొత్తు చిత్తయింది. యూపీలో రాహుల్ గెలుపు కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇక ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో బిజెపి సంచలన విజయాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.

చంద్రబాబు ఎవరితో అయితే కలిసి మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నాలు చేశారో ఆ పార్టీల‌న్నీ అట్ట‌ర్ ఫ్లాప్ అవుతున్నాయి. చంద్రబాబు ఒక‌టి చేయాలనుకున్న ఆయన మిత్రులందరూ ఆయన లెగ్‌ పుణ్యమా అని చిత్తుచిత్తుగా ఓడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అందరికీ షాక్ ఇస్తూ బిజెపి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టిన టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు ఆయ‌న మిత్రులు కూడా ఈ ఎన్నిక‌ల దెబ్బ‌తో బాబును న‌మ్మే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌డం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -