Thursday, March 28, 2024
- Advertisement -

కొత్త ఇంటి అన్వేష‌న‌లో మాజీ సీఎం…..

- Advertisement -

అమ‌రావ‌తి ప్రాంతంలో కృష్ణాన‌ది ప‌రీ వాహ‌క ప్రాంతాల్లో వెల‌సిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై సీరియ‌స్‌గా దృష్టి సారించారు సీఎం వైఎస్ జ‌గ‌న్. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో య‌దేచ్చ‌గా ప‌ర్యావ‌ర‌న నిబంధ‌న‌ల‌ను తుంగ‌లోకి తొక్కి ప‌దుల సంఖ్య‌లో అక్ర‌మ క‌ట్ట‌డాలు వెలిసి సంగ‌తి తెలిసందే. ప్ర‌ధానంగా కృష్నాన‌ది క‌ర‌క‌ట్ట స‌మీపంలో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చివేత‌ను ప్రారంభించింది ప్ర‌భుత్వం. దానిలో భాగంగానె అక్ర‌మంగా నిర్వ‌హించిన ప్ర‌జావేదిక కూల్చివేత‌తోనె మొద‌లు పెట్టారు.

అయితే అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చి వేత‌తో చంద్ర‌బాబ‌కు ఇబ్బందులు త‌ప్ప‌డడంలేదు. ప్ర‌స్తుతం బాబు ఉంటున్న లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ కూడా అక్ర‌మ క‌ట్ట‌డ‌మే.ప్రజా వేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు అంటూ.. చంద్రబాబు ఉండవల్లి నివాసం కూడా ఆ జాబితాలో ఉందని జగన్ పరోక్ష సంకేతాలిచ్చారు. అందుకే ముందుగాల‌నె బాబు జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

సర్కార్ తన నివాసాన్ని కూల్చివేసే చర్యలు మొదలుపెట్టకముందే.. గౌరవప్రదంగా తానే ఖాళీ చేస్తే మంచిదనే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. గుంటూరు-విజయవాడలకు అందుబాటులో ఉండేలా కొత్త నివాసాన్ని ఏర్పరుచుకోవాలని ఆయన భావిస్తున్నట్టు స‌మాచారం.

మ‌రో వైపు ఉద్దండరాయునిపాలెంకి చెందిన కొంతమంది టీడీపీ నేతలు.. ఆయనకు ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా ముందుకొచ్చినట్టు స‌మాచారం . ఈ నేపథ్యంలో చంద్రబాబు కొత్త ఇంటిని నిర్మించుకుంటారా? లేక ఇప్పటికే నిర్మాణం పూర్తయిన మరో ఇంటిలోకి షిఫ్ట్ అవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్ర‌స్తుతం లింగ‌మ‌నేని గెస్ట్ హౌస్ పై హైకోర్టులో కేసు న‌డుస్తోంది. కోర్టు కేసులో ఉన్న ఇంటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్దపడకపోవచ్చు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక్క‌డే ఉంటె భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని బాబు బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తానే ఇంటిని ఖాళీ చేసి మరో చోటుకు మారాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి జగన్ దెబ్బకు చంద్రబాబు తన ఇంటిని ఖాళీ చేయబోతున్నారన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -