ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప….

3253
AP Ex CM Chandrababu jailed for two years : Says BJP
AP Ex CM Chandrababu jailed for two years : Says BJP

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో బాబ‌కు అన్ని వైపుల‌నుంచి క‌ష్టాలు చుట్టుముడుతున్నాయి. అధికారంలో ఉన్న‌ప్పుడు చేసిన అక్ర‌మాలు ఇప్పుడు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటున్నాయి. ఇష్టాను సారం నిధుల‌ను త‌న అనుయాయుల‌కు దోచి పెట్టారు. ఎన్నిక‌లు సంవ‌త్స‌రం ఉంద‌నంగా భాజాపా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన బాబు త‌ర్వాత న‌రేంద్రమోదీ, భాజాపా ప్ర‌భుత్వంపై చేసిన విమ‌ర్శ‌లు అన్నీ ఇన్నీ కావు. మోదీని మ‌రో సారి ప్ర‌ధాని కాకుండా భాజాపా యేత‌ర పార్టీల‌ను ఏకంచేసేందుకు దేశం అంతా తిరిగారు. కాని బాబు ప్ర‌య‌త్నాలు ఫలించ‌లేదు. బంప‌ర్ మెజారిటీతో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు భాజాపా అస‌లు టార్గెట్ టీడీపీనీ భూస్థాపితం చేయ‌డం. ఇప్ప‌టికే పార్టీని నిర్వీర్యం చేసె ప‌నిలో న‌లుగురు ఎంపీల‌ను భాజాపాలో చేర్చుకొని సంగం విజ‌యం సాధించారు క‌మ‌ల నాధులు. ఇప్పుడు వారి టార్గెట్ చంద్ర‌బాబ‌నే.

కృష్ణ జిల్లాలో బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ బహిరంగంగా చేసిన సంచలన ప్రకటన టీడీపీలో గుబులు రేపుతోంది. రాబోయే రెండేళ్లలో జైలుకు పంపడానికి కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప్లాన్ రెడీ చేసిందా అంటే తాజా మాటలను బట్టి అవుననే సమాధానం వస్తోంది. తెరవెనుక మంత్రాంగం నడుపుతున్న బీజేపీ ఓడిన టీడీపీని నిర్వీర్యం చేసే సామధాన బేధ దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు ఆయ‌న వ్యాఖ్య‌లు చూస్తుంటేనే అర్థ మ‌వుతోంది.

కేంద్ర ప్రభుత్వ నిధులను చంద్రబాబు పక్కదోవ పట్టించి, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించి, 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు.ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు కట్టప్ప మాదిరిగా తయారయ్యాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబును ఉపేక్షించడం తగదన్నారు.

ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన సునీల్ ధియోధర్ ను ఇటీవలే ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈయన మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్ గా వ్యవహరించాడు. ఇంత దగ్గరైన నేత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును రాబోయే రెండు సంవత్సరాల్లో జైలుకు పంపిస్తామని సంచలన ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఒక ప్లాన్ ప్ర‌కారం టీడీపీనీ దెబ్బ‌కొట్టేందుకు భాజాపా త‌న ప్లాన్‌ల‌ను అమ‌లు ప‌రుస్తోంది..నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను చేర్చుకున్న బీజేపీ.. తాజాగా అంబికా కృష్ణను కూడా చేర్చుకొని షాకిచ్చింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసింది. రెండేళ్లలోనే టీడీపీని నిర్వీర్యం చేసి చంద్రబాబును జైలుకు పంపేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

Loading...