Tuesday, March 19, 2024
- Advertisement -

ఏపీలో పీపుల్స్ పల్స్ సర్వే.. వైసీపీదే హ‌వా

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. అయితే ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ ల మ‌ధ్య‌నే పోటీ జ‌రిగింద‌న‌డంలో సందేహంలేదు.దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో పీపుల్స్‌ పల్స్ త‌న స‌ర్వేఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించవచ్చని సర్వే ద్వారా అంచనా వేసింది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ 59 స్థానాల్లో గెలుపొందే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది. అలాగే వైఎస్సార్‌సీపీ 18 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని, టీడీపీకి 4 నుంచి 6 స్థానాలు వస్తాయని చెప్పింది.

వైఎస్సార్‌సీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది. వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ ఖాతా తెరవక పోవచ్చునని, అలాగే జనసేనకు 10 జిల్లాల్లో ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని సర్వే ద్వారా చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -