Friday, March 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి రావడం బాలయ్య ఫ్యామిలీకి ఇష్టం లేదా ?

- Advertisement -

టీడీపీ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లాక.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయ పదవులకు దూరంగా ఉన్నారు. అయితే తండ్రి ఎన్టీఆర్ తో ముందు నుంచి ఉన్న హరికృష్ణ మాత్రం ఓసారి రాజ్య సభ సభ్యడు పదవితో పాటు ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం జరిగింది. అంతకు మించి హరికృష్ణకు దక్కింది ఏమి లేదు. ఎప్పటికైనా హరికృష్ణతో ముప్పనుకున్న బాబు.. ఆయన్ని పార్టికి దూరం పెడుతూ వచ్చారు.

ఇక అవసరానికి 2009 ఎన్నికల కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తెచ్చుకున్న చంద్రబాబు, తరువాత పార్టీకి మరియు నందమూరి కుటుంబానికి దూరం చేశారు. అయితే బాబు ఏం చేసిన కొడుకు కోసమే అన్నట్లు చేశాడు. లోకేష్ కి ప్రత్యామ్నాయంగా టీడీపీలో మరో బలమైన లీడర్ ఉండకూడదు అనేది బాబు ఆలోచన. అందుకే తెలివితో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ని దగ్గరవ్వకుండా చూశాడు. టీడీపీ పార్టీ ఘోరపరాభవానికి, నేటి దుస్థితికి చంద్రబాబు పుత్ర వాత్సల్యమే కారణమని తెలుగు తమ్ముళ్లు కూడా అన్న మాటే. కొడుకుపై ప్రేమను మరచి ఎన్టీఆర్ లాంటి సమర్దుడిని దించితేనే టీడీపీకి భవిష్యత్తు అనేది టీడీపీ నేతల వాదన.

ఒకవేళ ఎన్టీఆర్ టీడీపీలో ఉంటే.. 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు మళ్లీ సీఎం అయినా.. తర్వాత భవిష్యత్ సీఎం ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తుంది కానీ, లోకేశ్ పేరు రాదు. అందుకే టీడీపీలోకి ఎన్టీఆర్ ను రానివ్వడం లేదు. ఈ విషయంలో బాలయ్య అల్లుడు భరత్ కూడా వ్యతిరేకించడం ఆసక్తికరం. ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం బాలయ్య చిన్నల్లుడు భరత్ కూడా ఇష్టపడడం లేదట. ఎన్టీఆర్ ని పార్టీలోకి తేవద్దనేది ఆయన వాదన అని సమాచారం. గతంలో కూడా భరత్ ఎన్టీఆర్ పై నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్, వస్తే ఎవరూ కాదనరు అన్నారు. ఎన్టీఆర్ రాకపోయినా టీడీపీని సమర్ధవంతంగా నడిపే నాయకులు ఉన్నారని అన్నారు. ఎన్టీఆర్ విషయంలో భరత్ ఎందుకు అభద్రతా భావం ఫీల్ అవుతున్నాడనేది చర్చనీయంశం అయింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!

విజయసాయిరెడ్డికి గంటా ఇలా షాక్ ఇవ్వనున్నాడా ?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -