నన్ను ముట్టుకోకు.. రాహుల్ కి పునర్నవి వార్నింగ్!

1735
bigg boss 3 telugu rahul and punarnavi fight
bigg boss 3 telugu rahul and punarnavi fight

బిగ్ బాస్ మూడో సీజన్ లో రాహుల్, పునర్నవి జంట బాగా హైలెట్ అయింది. వీరు ఏం చేసిన అది చర్చే అవుతుంది. వీరిద్దరిపై హోస్ట్ నాగార్జున కూడా పంచులేస్తుంటాడు. అయితే తమ మధ్య ఏం లేదంటూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు వీరిద్దరు. పునర్నవి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్దం కాదని నాగ్ అంటూ ఉంటారు. నిజంగానే పునర్నవి ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి అర్దం కాదు.

తిడుతుంది.. వెంటనే నవ్వుతుంది. రాహుల్ ను మాట్లాడకు అని కోపడుతుంది. మళ్లీ తనే వచ్చి మాట్లాడుతుంది. తాజా ఎపిసోడ్లో రాహుల్, పునర్నవి మధ్య చిన్న గొడవ అయింది. ఖాళీగానే ఉన్నావ్ గా అని పునర్నవికి రాహుల్ ఓ పని చెప్పాడు. దాంతో సీరియస్ అయిన పునర్నవి.. నన్ను వదిలేయ్.. ముట్టుకోకు అని వార్నింగ్ ఇచ్చింది.

చూడు రాహుల్ ఎలా సతాయిస్తున్నాడో అని అలీకి కూడా ఫిర్యాదు చేసింది. కాసేపటికి పునర్నవే వచ్చి రాహుల్ తో మాట్లాడింది. అప్పుడు రాహుల్ సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడకు.. ఇరిటేషన్ వస్తుందని పునర్నవిపై ఫైర్ అయ్యాడు. దేని ఇరిటేషన్ అంటూ పునర్నవి తిరిగి ప్రశ్నించింది. నన్ను ముట్టుకోవద్దు అన్నవ్ కదా అని రాహుల్ అంటే.. నేనెప్పుడు అన్నాను అంటూ దబాయించింది పునర్నవి.

ఈ విషయలన్నీ వరుణ్ తో రాహుల్ చెప్పుకుంటూ బాధపడ్డాడు. పునర్నవికి ఎక్కువ చనువు ఇచ్చానని రాహుల్ అన్నాడు. పునర్నవి కూడా ఇదే విషయంపై వరుణ్ తో డిస్కర్శన్ చేసింది. ఈ విషయంలో మీరు మీరు చూస్కోండి అంటూ వరుణ్ సైడ్ అయ్యాడు. అయితే ఇలాంటి గొడవలు వీరికి మాములే అని అందరికి తెలిసిందే.

Loading...