Friday, April 19, 2024
- Advertisement -

నారా లోకేష్‌పై సీబీఐ విచార‌ణ‌…?

- Advertisement -

ఎన్నిక‌ల్లో ఓడినా టీడీపీకీ చంద్ర‌గ్ర‌హ‌ణం వీడ‌టంలేదు. భాజాపా దెబ్బ‌కు త్వ‌ర‌లోనె పార్టీ ఖాలీ మొత్తం అవుతుందె సంకీతాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కీల‌క నేత‌లు క‌షాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ మ‌ధ్య‌నె భాజాపాలో చేరిన అన్నం స‌తీష్ లోకేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటి శాఖలో జరిగిన అవినీతిపై రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రిని కలిసి విచార‌ణ కోరుతాన‌ని వెల్ల‌డించారు.

పార్టీలో ఎంతోమంది నాయకులు లోకేశ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నం సతీష్ ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో పని చేయడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేశానని వివరించారు. ఐటీ శాఖ‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్రంతో మాట్లాడి సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతా నన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును లోకేశ్ నిలువునా ముంచేశారని ధ్వజమెత్తారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు కూడా లోకేశ్ ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టారని అన్నారు. లోకేశ్ కారణంగా త్వరలోనే టీడీపీ కాళీ కాబోతుందని అన్నం సతీష్ జోస్యం చెప్పారు. టీడీపీ అభివృద్ధి కోసం వాల్ పోస్టర్లు కూడా అంటించానని.. సొంత నిధులు ఖర్చుపెట్టి పార్టీని నడిపించానని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌లా తండ్రిని అడ్డుపెట్టుకొని మంత్రిని కాలేదని విమర్శించారు. అర్హత లేకపోయినా పార్టీని నడిపేందుకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారనీ, అందుకే టీడీపీ ఓడిపోయిందని గతంలో సతీష్ ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -