Friday, March 29, 2024
- Advertisement -

ఆదిని భాజాపాలో చేరకుండా చెక్ పెట్టిన ఎంపీ….? కారణం అదేనా…?

- Advertisement -

ఎన్నికల్లో ఘోర ఓటమి ప్రభావం టీడీపీ పడింది. 23 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీభవిష్యత్ పై నమ్మకం లేకపోవడంతో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు కాషాయ కండువా కప్పుకున్నారు.

అదే దారిలో వెల్లడానికి మాజీ మంత్రి ఆది కూడా పార్టీకి రాజీనామా చేసి భాజాపాలో చేరేందుందుకు రెడీ అయ్యారు. భాజాపాలో చేరుుతన్న విషయాన్ని టీడీపీ అధినేత బాబుతో చెప్పానని ప్రకటించారు. వైసీపీనీ ఎదుర్కోవాలంటే టీడీపీలో ఉంటే సాధ్యం కాదని అందుకే భాజాపాలో చేరుతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. కాని క్లైమాక్స్ లో ఆది చేరికకు ఓ ఎంపీ బ్రేక్ లు వేశారంట. ఆది పార్టీలోకి రాకుండా కేంద్రంలో పావులు కదిపిన ఎంపీ అందులో విజయం సాధించారు.ఆదిపై లేని పోని మాటలను ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పారట. దీంతో కమలనాథులు ఆయనను చేర్చుకోవడానికి వెనకడుగు వేస్తున్నారట. ఈ విషయం ఆదికి డైరెక్ట్ గా చెప్పలేక అపాయంట్ మెంట్ పేరుతో తిప్పుకుంటున్నారంట.

ఢిల్లీలో భాజాపా అధిష్టానం కరుణ కోసం పది రోజులుగా అక్కడే ఉన్నారంట.అటు అమిత్ షా గానీ, ఇటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గానీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇంతకు ఆ ఎంపీ ఎవరంటే.. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనే టాక్ వినిపిస్తోంది.

ఆది పార్టీలోకి వస్తే ఎక్కడ తన ఆధిపత్యానికి గండిపడుతుందోననె భయమే కారణమంట. నిన్నటి వరకు టీడీపీలో ఉన్న రమేష్ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో భాజాపా గూటికి చేరుకున్నారు. దీంతో కడప జిల్లా మొత్తం తన చేతిలోనే ఉందని ఫీల్ అవుతున్న రమేష్.. ఆది నారాయణ లాంటి పెద్ద తలకాయను బీజేపీలో చేర్చుకుంటే తనకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలించవేమోనని భావిస్తున్నారట . అందుకే ఆదిపై లేనిపోని అపోహలను అధిష్టానానికి చెప్పారంట. భాజాపా కూడా ఆదికి మొండిచేయి చూపించడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -