చంద్రబాబుకి షాక్ ఇచ్చిన కిర‌ణ్ కుమార్ రెడ్డి

554
Chittoor tdp leaders shock from cm chandrababu
Chittoor tdp leaders shock from cm chandrababu

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి ఆయ‌న సొంత జిల్లాల‌నే భారీ షాక్ త‌గిలింది. పిలేరు నియోజకవర్గం మాజీ ఇన్ చార్జీ ఇక్బాల్ మొహమ్మద్ టీడీపీకి రాజీనామా చేశారు.ఆయ‌న‌తో పాటు సహా 21 మంది నేతలు అధికార పార్టీకి రాజీనామా సమర్పించారు.దీనికి కార‌ణం మాజీ సీఎం కిర‌ణ్ కూమార్ రెడ్డి అని తెలుస్తుంది.గ‌త 20 సంవ‌త్స‌రాల‌కు పైగా టీడీపీ పార్టీకి త‌మ జీవితాన్ని ధారపోశామని కాని ,త‌మ‌ను చంద్ర‌బాబు కూడా మోసం చేశార‌ని తెలిపారు ఇక్బాల్ మొహమ్మద్. మీడియా సమావేశంలో ఇక్బాల్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబీకులపై పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు తమపై ఒత్తిడి చేశారని వెల్లడించారు.

టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత త‌మ‌ను అన్ని విధాల అదుకుంటామ‌ని చెప్పిన బాబు త‌మ‌ను అన్ని విధాల మోసం చేశార‌ని ఆయ‌న మీడియా సాక్షిగా చెప్పుకొచ్చారు.ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటివరకూ తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మేఏ ఎవ‌రిపై అయితే ఇన్నాళ్లు పోరాటం చేశామో ఆయ‌న త‌మ్ముడినే పార్టీలో చేర్చుకుని సీటు ఇస్తున్నార‌ని ఇక్బాల్ వాపోయారు.చంద్రబాబును చాలాసార్లు కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామనీ, అయినా పట్టించుకోలేదని తెలిపారు ఇక్బాల్ మొహమ్మద్.