Thursday, April 25, 2024
- Advertisement -

బాబు మెడ‌కు చుట్టుకుంటున్న ప‌వ‌ర్ …వ‌దిలేది లేదంటున్న సీఎం జ‌గ‌న్‌

- Advertisement -

అధికారం కోల్పోయినా అవినీతి ఆరోప‌న‌లు మాజీ సీఎం చంద్ర‌బాబును వ‌ద‌ల‌డంలేదు. నిన్ను వ‌ద‌లా అంటూ సీఎం జ‌గ‌న్ వెంటాడుతున్నారు. అధికారం ఉంది క‌దాని విచ్చ‌లి విడిగా ప‌వ‌ర్ ప్రాజెక్టుల‌లో అక్ర‌మాల‌కు తెర‌లేపార‌ని ప్ర‌తి ప‌క్షంలో ఉన్న ప్పుడు జ‌గ‌న్ ఆరోపించారు. విద్యుత్ ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిని ప్ర‌క్షాల‌ను చేసేందుకు జ‌గ‌న్ స‌హాసోపేత నిర్ణ‌యం తీసుక‌న్నారు. అవినీతి చేస్తె స‌హించేది లేద‌ని చెప్పిన జ‌గ‌న్ కేం ద్రంఆదేశాల్ని కేర్ చేయ‌డం లేదు.

బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో 24 గంట‌ల విద్యుత్ కోసం అవ‌స‌రం లేకున్నా సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు పేరుతో ఏపీలో ఇదివరకటి టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్ష జ‌ర‌పాల‌ని సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. అయితే దీనివల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందనీ, సమీక్షలు చేపట్టి పీపీఏలను రద్దుచేయడం మంచిది కాదని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం . విషయంలో కేంద్రం రాసిన లేఖపై అధికారులు, మంత్రులతో చర్చించిన ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాల్ని సమీక్షించి తీరాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానె పిపిఎల విచారణకు జగన్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.

2014 తర్వాత దేశవ్యాప్తంగా జల విద్యుత్ లభ్యత పెరిగింది. ఉత్తరాదిన చాలా రాష్ట్రాలు గణనీయంగా జల విద్యుత్ ఉత్పత్తి చేపట్టాయి. కేంద్రం చేపట్టిన చర్యలతో నీటి లభ్యత పెరగడంతో సహజంగానే జలవిద్యుత్ ఉత్పత్తి కూడా పెరిగింది. దీంతో ఏ రాష్ట్రం కూడా అధిక ధ‌ర‌ల‌కు సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల‌ను కొన‌డంలేదు. కానీ గత టీడీపీ సర్కారు… కేంద్రం 24 గంటల విద్యుత్ కోసం పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నా… ధర్మల్, సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లకు మొగ్గు చూపింది. యూనిట్‌కు దాదాపు 5 నుంచి 6 రూపాయలు చెల్లించి మరీ సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు చేయడం అప్పట్లోనే చాలా విమర్శలకు దారితీసింది.

ఇటీవల ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మోదీతో పాటు స్వామివారిని దర్శనం చేసుకున్న జగన్.. పీపీఏల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ‘తప్పు జరిగినప్పుడు సమీక్షించడంతో తప్పు ఏముంది?’ అని అడిగినట్లు పేర్కొన్నాయి. సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, గత ప్రభుత్వం రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా చేసిన త‌ప్పులు వెంటాడ‌క త‌ప్ప‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -