Saturday, April 20, 2024
- Advertisement -

బాబూ నేను నీలా చేయ‌ను…! అసెంబ్లీస‌మావేశాల్లో బాబుపై సెటైర్లు వేసిన సీఎం జ‌గ‌న్‌….

- Advertisement -

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. స్పీక‌ర్‌గా సీనియ‌ర్ నేత త‌మ్మినేని సీతారాం ఏక‌గ్రీవంగా ఎన్నిక‌ల‌య్యారు. సీఎం జ‌గ‌న్ ఆయ‌న్న ధ‌న్య‌వాదాలు తెలుపుతూ తొలిసారి ప్ర‌సంగం చేశారు. మొద‌టి ప్ర‌సంగంలోనె బాబుపై బాణాలు ఎక్కుపెట్టారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన 23 మందిని గత ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందని నిప్పులు చెరిగారు. అటువంటి దుర్మార్గమైన పరిస్థితిని మరోసారి సభలో రానివ్వబోనని అన్నారు.

బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ చట్ట సభలో మళ్లీ చూపిస్తానని జగన్ స్పష్టం చేశారు. టెండర్ల వ్యవస్థలోనూ, గ్రామస్థాయిలోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోను అవినీతిని తొలగించి, విలువలు, విశ్వసనీయతకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా చేసి చూపిస్తానని అన్నారు. అందుకు అనుగునంగానె మొద‌టి రోజునుంచి ప్ర‌భుత్వం ఆదిశ‌గా అడుగులు వేస్తోంద‌న్నారు.

టీడీపీ నుండి తమ పార్టీలో ఎవరినైనా చేర్చుకొంటే… టీడీపీ ద్వారా పొందిన పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే తమ పార్టీలో చేర్చుకొంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఒక వేల పార్టీకి రాజీనామా చేయ‌కుండా పార్టీ మారితే వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్పీక‌ర్‌ను కోరారు.

ఏపీ అసెంబ్లీలో టీడీపీకి ఈ దఫా 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కాయి, మరో ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపుకు లాక్కొంటే చంద్రబాబునాయుడుకు తనకు ఏం తేడా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.టీడీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను లాక్కొంటే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడ కోల్పోతారని జగన్ గుర్తు చేశారు. కాని అలాంటి అనైతిక చ‌ర్య‌ల‌ను తాము తీసుకోమ‌న్నారు.

గత టర్మ్‌లో 67 మంది తమ పార్టీ ద్వారా విజయం సాధిస్తే వారిలో 23 మందిని టీడీపీలో చేర్చుకొన్నారని జగన్ గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అధికార బెంచీల్లో కూర్చొబెట్టుకొని… నలుగురికి మంత్రి పదవులు కూడ కట్టబెట్టారని జగన్ గుర్తు చేశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -