’సరిలేరు నీకెవ్వరు’ విజయశాంతి ఫస్ట్ లుక్..!

874
First Look Sarileru Nekevvaru Bharathi Madam
First Look Sarileru Nekevvaru Bharathi Madam

హీరోలతో సమానంగా అప్పట్లో పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. దాదాపుగా పదమూడు ఏళ్ల తర్వాత ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తోంది. సినిమాలకు బ్రేక్ వేసి రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇన్నాళ్లకు మళ్లీ ఆమె సినిమాల్లోకి రావడం ఆమె ఫ్యాన్స్ ను సంతోషపెడుతోంది. ఆమె రీఎంట్రీ ఎలా ఉండబోతుంది.. ఆమె ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎదురు చూసిన క్రమంలో దీపావళి శుభాకాంక్షలతో విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ’సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంతోనే విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పుడు రిలీజ్ ఆమె లుక్ మహేష్ బాబుకు ధీటుగా ఉంది. ఈ సినిమాలో విజయశాంతి భారతి అనే డిగ్ని ఫైడ్ మహిళగా కనిపించనున్నారు. బూడిద రంగు చీర.. కాంబినేషన్ బ్లౌజ్.. కాటుక కళ్ళు.. నుదిటిన నల్లని బొట్టు.. సింపుల్ హెయిర్ స్టైల్.. ఓ కాలేజ్ లెక్చరర్ ఎంత హుందాగా కనిపిస్తారో అదే స్థాయిలో విజయశాంతి లుక్ ఉంది.

కాలు మీద కాలు వేసుకుని కూచున్నారంటే.. కచ్చితంగా లెక్చరర్ లేదా ఏదైన ప్రభుత్వ అధికారి అయ్యి ఉండొచ్చు. మరి ఏ రోల్ లో ఆమె కనిపిస్తున్నారో అనేది మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. అయితే భారతి మేడమ్ కు జరిగే అవమానాల్ని అన్యాయాల్ని ఎదురించేందుకు బార్డర్ నుంచి వచ్చే సైనికుడిగా మహేష్ ఈ సినిమాలో కనిపిస్తారని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కశ్మీర్ టు కర్నూల్ కొండ రెడ్డి బురుజు స్టోరీలో చాలా సస్పెన్స్ లు, ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది.

ఇక కశ్మీర్ నుంచి రైలు ప్రయాణంలో హీరోయిన్ రష్మీక పరిచయం కావడం ఆమె తో హీరో ప్రేమలో పడటం జరుగుతుందట. ఇక ఈ చిత్రం 2020 జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. అనీల్ రావుపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సుంకర- దిల్ రాజు- మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

Loading...