ఐపీఎల్ 2020 విజేత ఎవరో చెప్పి చెన్నైకి షాక్ ఇచ్చిన శ్రీశాంత్

808
Former India Pacer S Sreesanth Predicts Winner Of Ipl 2020
Former India Pacer S Sreesanth Predicts Winner Of Ipl 2020

లాక్ డౌన్ వేళ భారత వివాదస్పద ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నాడు. భారత క్రికెట్ గురించి ఆసక్తికర విషయాలని కొన్ని రోజులుగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్న శ్రీశాంత్.. తాజాగా ఐపీఎల్ 2020 సీజన్ లో విన్నర్ గా నిలిచే టీం ఏదో అంచనా వేశాడు.

ఈ నేపథ్యంలో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌కి షాకిచ్చిన ఈ వెటరన్ పేసర్.. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో ఉత్సాహం నింపాడు. హలో యాప్ లైవ్ లో తాజాగా శ్రీశాంత్.. ఐపీఎల్ 2020 విజేత, ప్లేఆఫ్‌కి చేరే నాలుగు జట్లు ఏవో అంచనా వేశాడు. ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ కరోనా వైరస్ కారణంగా 2022కి వాయిదాపడే సూచనలు కనిపిస్తుండగా.. ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దాంతో.. ఇప్పటి నుంచే ఐపీఎల్ విజేత, ప్లేఆఫ్ గురించి చర్చలు మొదలైపోయాయి.

2019 ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది కూడా ముంబయి ఇండియన్స్ టీమ్ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పిన శ్రీశాంత్.. ప్లేఆఫ్‌కి చేరే నాలుగు జట్లలో బెంగళూరు కూడా ఉంటుదని చెప్పాడు. ఐపీఎల్ 2020 సీజన్‌ ప్లేఆఫ్‌కి బెంగళూరు చేరుతుందని అంచనా వేసిన శ్రీశాంత్.. ముంబయి, చెన్నై, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన మూడు జట్లని వెల్లడించాడు.

Loading...