ఒకే ఒక్క పరుగుతో విరాట్ కోహ్లీ మరో వరల్డ్ రికార్డు..!

852
indian captain virat kohli eyes another record in world cricket
indian captain virat kohli eyes another record in world cricket

భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలోని రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు. శ్రీలంకతో శుక్రవారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో జస్ట్ ఒక్క పరుగు చేస్తే చాలు మరో వరల్డ్ రికార్డు తన ఖాతలో నమోదు కానుంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ రికార్డును కైవసం చేసుకున్న కోహ్లీ.. ఇప్పుడు మరో పరుగు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా 11వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలువనున్నాడు. ఈ ఘనతను ఇప్పటికే ఐదుగురు సాధించారు. అయితే శుక్రవారం మ్యాచ్‌లో కోహ్లీ తన ఖాతాను ఓపెన్ చేస్తే చాలు అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లో 11వేల పరుగులు పూర్తి చేసిన కెఫ్టెన్ గా నిలుస్తాడు.

కోహ్లీ ఇప్పటివరకు కెఫ్టెన్ గా ఆడిన అన్ని మ్యాచ్ లు కలిపి 10,999 రన్స్ చేశాడు. మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉంది. శుక్రవారం మ్యాచ్‌లో భారత్ గెలిస్తే లంకపై మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. 2008లో కోహ్లీ అరంగేట్రం తర్వాత ఇరుజట్ల మధ్య జరుగుతున్న 19వ సిరీస్ ఇది. అయితే ఇందులో 16 సిరీస్‌లను భారత్ కైవసం చేసుకుంది.

Loading...