యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎవరికి తెలియని నిజాలు..!

1875
Interesting Facts About Anchor Vishnu Priya
Interesting Facts About Anchor Vishnu Priya

వెండితెరపై, బుల్లితెరపై కానీ రాణించాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉండాలి. అందులో ఇప్పుడు బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది యాంకర్ విష్ణుప్రియా. బుల్లితెరపై ఇప్పటికే యాంకర్ అనసూయ, రశ్మీ దూసుకెళ్తున్నారు. అలాగే వీరు వెండితెరపై కూడా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ స్టార్ యాంకర్స్ కి పోటీ ఇస్తుంది విష్ణు ప్రియా.

పోవే పోరా ప్రోగ్రాంలో సుధీర్ కు జోడిగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈ ప్రోగ్రాం తో బాగా ఫాపులర్ అయింది. ఈ ప్రోగ్రాం చేయకముందు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లో విష్ణు ప్రియ నటించింది. ఇప్పుడు మాత్రం తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు విష్ణు ప్రియాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదే డబ్బుల కోసం తను భగవద్గీత చెప్పేదని.

చిననాటి నుండి తన తాతగారి దగ్గర భగవద్గీతలోని అన్ని అధ్యయనాలు నేర్చుకుందట. అవే పిల్లలకు చెప్పేదట. అలా చెప్పినందుకు వారి దగ్గర ఎంతో కొంత ఫీజ్ తీసుకునేదట. అంతేకాకుందా భగవద్గీతకు సంబంధిన కాంపిటీషన్స్ లో, ప్రోగ్రామ్స్ లో విష్ణు ప్రియకు ఎన్నో అవార్డులు, బాహుమతులు వచ్చాయట. ఏది ఏమైన మొత్తానికి కష్టపడి ఇప్పుడు మంచి యాంకర్ గా రాణిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Loading...