Wednesday, April 24, 2024
- Advertisement -

అమ్మాయిగా మారడానికి కారణం ఏంటో చెప్పిన జబర్దస్త్ పింకీ..!

- Advertisement -

జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లో లేడీ గెటప్ లు వేస్తూ మంచి పాపులారిటీ సంపాధించుకుంది సాయి అలియాస్ పింకీ. అయితే ఇటీవల కాలంలో సాయి పూర్తిగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారి ప్రస్తుతం అదిరింది షో లో వేణు వండర్స్ టీమ్ లో చేస్తోంది. అయితే తాజాగా పింకీ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలకు జవాబు ఇచ్చింది.

ఇందులో భాగంగా తాను అమ్మాయిగా మారడానికి ఆపరేషన్ చేయించుకున్న మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో తన స్నేహితులు చాలా సహాయం చేశారని చెప్పింది. అంతేకాకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు చాలా సేవలు చేశారని చెప్పింది. అయితే కొందరు తాను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అది సరికాదని తెలిపింది.

అలాగే తాను డబ్బు సంపాదించడం కోసం అమ్మాయిగా మారానని అనుకుంటున్నారని అందులో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.అంతేకాక తాను అమ్మాయిగా ఉండాలా.? అబ్బాయిగా ఉండాలా.? అనేది తన పూర్తి వ్యక్తిగతమని, ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇతరులు చాలా ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పింకీ షోస్ చేస్తూనే సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -