రహస్యంగా జబర్దస్త్ నటి పెళ్లి.. క్లారిటీ ఇదే..!

34734
jabardasth sai teja alias pinky gets secret marriage there is truth
jabardasth sai teja alias pinky gets secret marriage there is truth

బుల్లితెరపై జబర్దస్త్ కి మంచి క్రేజ్ ఉంది. టీఆర్పీ రేటింగ్ లో కూడా ఈ షో టాప్ లో దూసుకెళ్తోంది. జబర్దస్త్ కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో అదే రెంజ్ లో ఈ షోపై పుకార్లు కూడా వస్తుంటాయి. జబర్దస్త్ షో నటులు, యాంకర్స్ పై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సాయితేజ అలియాస్ పింకీకి పెళ్లయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

ఇటివలే సీక్రెట్ గా వివాహం చేసుకుందని వార్తలు వచ్చాయి. జబర్దస్త్ లో లేడీ గెటప్ లో కనిపించిన సాయితేజ.. కొంత కాలంగా జబర్దస్త్ కు దూరంగా ఉంటున్నారు. లేడీ గెటప్స్ లో పాపులర్ అయిన సాయితేజ.. తర్వాత నిజంగానే అమ్మాయిగా మారిపోయాడు. జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకొని యువతిగా మారాడు. తన పేరు ప్రియాంక సింగ్ గా మార్చుకుంది. అయితే టిక్ టాక్ లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఆ వీడియోల్లో ప్రియాంక సింగ్ మెడలో పసుపు తాడు ఉండడం, చేతులకు పెళ్లి కూతురులా గోరింటాకు పెట్టుకోవడం చూసి.. ఆమెకు పెళ్లయిందని భావిస్తున్నారు. అంతేకాదు వీడియో ట్యాగ్ కూడా పెళ్లి అని పెట్టడడంతో.. పింకీకి కన్‌ఫామ్‌గా పెళ్లయిందని అందరు అనుకున్నారు. ఆమెని చేసుకున్న వ్యక్తి ఎవరని గూగుల్ లో సర్చ్ కూడా చేశారు కొందరు. అయితే ఈ పుకార్లపై స్వయంగా పింకీనే స్పందించింది. తనకు పెళ్లయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. విజయవాడ కనకదుర్గ ఆలయానికి వెళ్లినప్పుడు పూజారి ఇచ్చిన పసుపు తాడును ధరించానని.. అంతేతప్ప అది మంగళసూత్రం కాదని పుకార్లకు పుల్ స్టాప్ పెట్టింది.

Loading...