Thursday, April 25, 2024
- Advertisement -

సీఎం జగన్ నిర్ణయంకు జనసైనికులు ఆనందం.. ఏంటి సంగతి ?

- Advertisement -

జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల జన సైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ క్రెడిట్ మాత్రం తమ అధినేత పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. జనసైనికుల ఆనందానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. జగన్ సర్కార్ లా నేస్తంకు నిధులు రిలీజ్ చేయడమే వీరి ఆనందానికి కారణం. ప్రభుత్వం మార్చి నుండి జూన్ వరకు నిధులను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెల రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్‌ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 3న ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ నెల 5న పవన్ కళ్యాణ్ లా నేస్తం పథకం అమలు జరగడం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది నెలలుగా లాయర్లకు ఆర్దిక సాయం నిలిచిపోయిందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సాయం చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ లేఖ రాసిన రెండు రోజుల తర్వాత ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. అందుకే ఇది తమ విజయం అని జనసేన పార్టీ అంటుంది.

పవన్ కళ్యాణ్ లేఖ వల్లే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. జనసేన పోరాటం ఎప్పుడు ప్రజల తరుపునే అని జనసైనికులు అంటున్నారు. లా నేస్తం పథకానికి గత నాలుగు నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో జులై 5 న జనసేన అధినేత స్పందించారని.. జులై 7న ప్రభుత్వం నాలుగు నెలల బకాయిలని విడుదల చేసిందని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. సమస్యని పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.

జగన్ నుంచి రోజా , విడదల రజిని లకు గుడ్ న్యూస్ ?

కొల్లు రవీంద్రను అరెస్ట్ పై స్పందించిన కొడాలి నాని

మోకా భాస్కరరావు హత్య వెనుక కొల్లు హస్తం.. : ఎస్పీ రవీంద్రనాథ్‌

జగన్ ని అభినందించిన పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -