కంగన ఆఫీస్ ఖర్చు ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే..!

402
Kangana Ranaut Rs 48 crore office in Pali Hill
Kangana Ranaut Rs 48 crore office in Pali Hill

స్టార్ హీరోల ఇల్లులు, ఆఫీసులు ఎంత ఖర్చుతో నిర్మిస్తారో తెలిసిందే. అయితే వీళ్లందరికి షాక్ తగిలేలా చేసింది హీరోయిన్ కంగన. ప్రస్తుతం కంగన సొంత ఆఫీస్ సిద్ధమైంది. దీనికోసం ఏకంగా 48 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేసిందంటేనే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. అయితే అంత ఖర్చు ఎందుకు అయ్యింది? అంటే.. ఒకసారి ఆఫీస్ ఇన్ సైడ్ ఆర్కిటెక్చర్ చూస్తే మీకే అర్థమవుతుంది.

అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ముంబై- పాలి హిల్ సమీపంలో ఉన్న బంగ్లా నెంబర్ 5 కంగన కార్యాలయం. ఇది పూర్తిగా రెనోవేషన్ చేసిన భవంతి. రూ .48 కోట్ల ల్యాండింగ్ వ్యయంతో సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా దీనిని రీమోడల్ చేశారు. ఇది పర్యావరణ అనుకూలమైనది… ప్లాస్టిక్ రహితమైనది కాదు. కానీ దాని సొగసు సంథింగ్ స్పెషల్. యూరోపియన్ టచ్ తో కంగనా ఆలోచనలకు తగ్గట్టు ప్రతి గదిని డిజైన్ చేశారు.

ముఖ్యంగా ఆ యూరోపియన్ ఆర్కిటెక్చర్ తో భవంతిని తీర్చిదిద్దిన తీరు మెస్మరైజ్ చేస్తోందంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో వరస సక్సెస్ లతో వెళ్తున్న కంగాన.. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటుందట. కంగన ప్రస్తుతం తలైవి లో దివంగత సీఎం జయలలిత పాత్రలో నటిస్తోంది. ఇదే గాక పలు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది.

Loading...