Tuesday, March 19, 2024
- Advertisement -

ప‌స‌లేని ల‌గ‌డ‌పాటి వ్యాఖ్య‌లు…

- Advertisement -

దేశంలో ఏమోగానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల ఫ‌లితాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. చివరి దశ ఎన్నికలు ముగిసేవరకు ముందస్తు ఫలితాలు వెలువరించకూడదని ఈసీ ఆదేశాలు ఆంధ్రా అక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి కొంత సమాచారాన్ని లీక్ చేశారు. అయితే ల‌గ‌డ‌పాటి చెప్పిన దాంట్లో ప‌స‌లేద‌నిపిస్తోంది. కొత్త సీసాలో పాత‌సార లాగె అయ‌న ప్రెస్ మీట్ ఉంది.

హ‌ఠాత్తుగా ప్రెస్ మీట్ట పెట్ట‌డం వెనుక కార‌ణం లేక‌పోలేద‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నారు. రేపు చంద్రగిరిలో రీపోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరో సరికొత్త నాటకానికి తెరలేపార‌ని వైసీపీ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్‌ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు.

ల‌గ‌డ‌పాటి చెప్పిన విష‌యాల‌ను గ‌మ‌నిస్తే…ఆంధ్రప్రదేశ్ లో హాంగ్ ఏర్పడే అవకాశం లేద‌ని పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంద‌ని చెప్ప‌క‌నె చెప్పారు. ఆ పార్టీ ఈపాటికి ఏద‌నేది అంద‌రికి అర్థ‌మ‌య్యే ఉంటుంది. ఒకపార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుంది అని చెప్తూనే.. కలలు గన్న అమరావతిని నిర్మించుకుంటామని లగడపాటి చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కాలేదు. ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయో రేపు సాయంత్రం వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు.

తెలంగాణా ఎన్నికల సమయంలో తెలంగాణలో మహాకూటమికి గెలుస్తుందని చెప్పాడు. మహాకూటమి గెలిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పి ఓటర్లు అంతా కారు గుర్తుకు ఓటు వేశారు. ఒక విధంగా చెప్పాలంటె కారు దూసుకుపోవ‌డానికి ల‌గ‌డ‌పాటె కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు.

ఈసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘనవిజయంతో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అన్నారు. అయితే జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు కూడా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ మెగాస్టార్ కు చిన్నతమ్ముడు కాబట్టి కాస్త తక్కువలోనే ఉంటాడని అనడం ద్వారా పెద్దగా సీట్లు రావన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ప్రెస్ మీట్ పెట్ట‌డానికి ముందు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌తో భేటీ అయ్యారంటె తెలిసిప‌తోంది ల‌గ‌డ‌పాటి స‌ర్వే ఏప‌టిదో. ఏది ఏమైనా లగడపాటి చేసిన సర్వే ఎంతవరకు నిజం అవుతుందనే విషయం తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -