Thursday, April 25, 2024
- Advertisement -

టీడీపీకీ మ‌రో ఎమ్మెల్యే, అధికార ప్ర‌తినిధి బిగ్ షాక్‌….! భాజాపాలోకి జంప్‌….?

- Advertisement -

ఆంధ్రపద్రేశ్‌లో టీడీపీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరగా… ఇప్పుడు మరికొందరు నేతలు క‌మ‌లం పార్టీలోకి క్యూ క‌డుతున్నారు. పార్టీకి వీరాభిమానులం అని చెప్పుకొనె తెలుగు త‌మ్ముళ్లు అన్న అయిన బాబుకు చుక్క‌లు చూపిస్తున్నారు. ఏపీలో భాజాపా బ‌ల‌ప‌డేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చ‌డీ చ‌ప్పుడు లేకుండా చేస్తోంది. కొద్ది రోజుల్లో టీడీపీనీ అడ్ర‌స్ లేకుండా చేయ‌డానికి తాజ‌గా మ‌రో భారీ ప్లాన్ వేసింది.

పార్టీకి చెందిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, అధికార ప్రతినిధి లంకా దినకర్ పార్టీ మారేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే భాజాపా పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. టీడీపీని కాలీ చేసేందుకు ఇటీవ‌ల భాజాపాలో చేరిన సుజ‌నా చౌద‌రి చ‌క్రంతిప్పుతున్న‌ట్లు తెలుస్తోంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆ పార్టీ నేత రాం మాధవ్‌తో ఇద్దరు టీడీపీ నేతలు మంతనాలు జరిపినట్టు తెలిసింది.

అనగాని సత్యప్రసాద్ 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లూ ఆయన మోపిదేవి వెంకటరమణ మీద విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం కొన‌సాగినా అయ‌న మాత్రం మోపిదేవిపై 13వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

లంకా దినకర్ ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు పెద్దగా సమస్యలు లేవు. అయితే, అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే కాబట్టి, ఆయన బీజేపీలో చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. అలా కాకుండా రాజ్యసభలో చేసినట్టు మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని శాసనసభాపక్షాన్ని విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. భాజాపాలో చేరేందుకు సిద్దంగా ఉన్న ఎమ్మెల్యేలంద‌రూ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో టచ్‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అంతేగా….మోదీని తీవ్రంగా ద‌షించిన బాబ‌ను ఊరికే వ‌దుల‌తారా ఏంటి….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -