ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

4178
movies which were rejected by prabhas
movies which were rejected by prabhas

ఇండస్ట్రీకి వచ్చి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో మొత్తం చేసిన సినిమాలు 19 మాత్రమే. ఇప్పుడు 20 వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. అయితే అతని కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా 10 వరకు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఒక్కడు : ఈ చిత్రం మహేశ్ ను స్టార్ ని చేసింది. అయితే ఫస్ట్ ఈ సినిమా కథను నిర్మాత యం.ఎస్.రాజు దర్శకుడు గుణశేఖర్ ప్రభాస్, కృష్ణంరాజు లను వినిపించారట. అయితే కథ విషయంలో కాస్త ఆలోచించిన వారు వద్దని రిజక్ట్ చేశారట.

దిల్ : దిల్ సినిమాకు ముందు ప్రభాస్ నే అనుకున్నారట. కానీ ప్రభాస్ మరో సినిమాతో బిజీగా ఉండటం వల్ల దిల్ ను వదిలేశాడు.

సింహాద్రి : రాజమౌళి సింహాద్రి కథను ముందు ప్రభాస్ కే చెప్పాడట. కానీ ఈ మాస్ సినిమాని రాజమౌళి హ్యాండిల్ చేయగలడా అని అలోచించి ప్రభాస్ ఈ కథను రిజెక్ట్ చేసాడట.

ఆర్య : అల్లు అర్జున్ కెరీర్ ను మార్చిన చిత్రం ఆర్య. అయితే ఈ సినిమా కథను ప్రభాస్ కు వినిపిస్తే రిజక్ట్ చేశారట.

బృందావనం : ప్రభాస్ కు ‘మున్నా’ వంటి ప్లాప్ ఇచ్చానని.. అదే గిల్ట్ తో వంశీ బాధపడ్డాడట. తరువాత ‘బృందావనం’ కథని ప్రభాస్ వినిపిస్తే అప్పటికే ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలకి కమిట్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమాని వదిలేసాడని తెలుస్తుంది.

నాయక్ : ప్రభాస్ కోసం నాయక్ సినిమా కథ ను సిద్దం చేశాడట వినాయక్. కానీ రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాని ప్రభాస్ వదిలేశాడు.

కిక్ : రవితేజ మార్కెట్ ను రెండింతలు పెంచిన ‘కిక్’ సినిమా కథని మొదట ప్రభాస్ వద్దకే వెళ్ళిందట. ప్రభాస్ డిసైడ్ అయ్యే లోపే.. అప్పటికి రవితేజ పిచ్చ ఫామ్లో ఉండడంతో సూరి రవితేజ ను ఫైనల్ చేసుకున్నాడట.

ఊసరవెల్లి : ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా హీరో ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ కథ కూడా ప్రభాస్ రిజెక్ట్ చేసిందేనట.

డాన్ శీను : గోపిచంద్ మలినేని ఫస్ట్ ఈ కథను ప్రభాస్ కి చెప్పాడట. బుజ్జిగాడు సినిమాతో ఈ సినిమాలోని కార్యెక్టర్ ని పోల్చుకున్న ప్రభాస్.. వద్దని చెప్పాడట.

జిల్ : జిల్ కథను ముందు ప్రభాస్ కి వినిపించాడట డైరెక్టర్. కానీ ప్రభాస్ బాహుబలితో బిజీగా ఉండటం వల్ల కుదరలేదట. దాంతో ఈ సినిమాని గోపిచంద్ తో తీశాడు.

Loading...