Friday, March 29, 2024
- Advertisement -

మిస్టర్ KK రివ్యూ

- Advertisement -

విక్రమ్ ప్రధాన పాత్ర లో ఈ రోజు విడుదల అయిన చిత్రం మిస్టర్ కేకే. ఈ సినిమా లో అక్షర హాసన్, అబి హాసన్ కూడా నటించారు. పాయింట్ బ్లాంక్ అనే ఫ్రెంచ్ సినిమా కి ఇది రీమేక్. తమిళం లో విడుదల అవుతున్న సినిమా ని డబ్బింగ్ చేసి తెలుగు లో కి వదిలారు. ఈ సినిమా కి మంచి బజ్ ఉండటం తో సినిమా మీద అందరికీ ఆసక్తి ఉంది. రాజేష్ సెల్వ ఈ సినిమా దర్శకుడు. సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ:
కేకే (విక్రమ్) మలేషియా లో ఒక క్రిమినల్. అతడిని పట్టుకోవడం కోసం ఒక గ్యాంగ్స్టర్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యం లో వాళ్ళనుంచి తప్పించుకొనే క్రమం లో కేకే ఒక రోడ్ యాక్సిడెంట్ కి గురవుతాడు. ఆ యాక్సిడెంట్ నుండి కేకే ని వాసు అనే ఒక జూనియర్ డాక్టర్ సేవ్ చేస్తాడు. అయితే కేకే శత్రువులు వాసు భార్యని కిడ్నాప్ చేసి కేకే ని అప్పగించామని బెదిరిస్తారు. అప్పుడు వాసు, కేకే కలిసి ఏం చేశారు? కేకే తన శత్రువులని ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథ.

నటీనటులు:
సినిమా మొత్తం మీద విక్రమ్ నటన కచ్చితంగా హైలైట్గా నిలుస్తుంది. అండర్ కవర్ ఏజెంట్ గా విక్రమ్ చాలా అద్భుతంగా నటించారు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం తో ప్రేక్షకుల ముందుకు వచ్చే విక్రమ్ ఈసారి కూడా సరికొత్త కాన్సెప్ట్ తో విక్రమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అక్షర హాసన్ కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. గర్భవతి పాత్రల్లో కనిపించిన అక్షర హాసన్ తన నటనతో కచ్చితంగా అందరినీ మెప్పిస్తుంది. అక్షర హాసన్ భర్త పాత్రలో అబి హాసన్ చాలా బాగా సహజంగా నటించారు. లేనా తన పాత్రలో ఒదిగిపోయి మంచి నటనను కనబరిచింది. వికాస్ కి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోసాడు వికాస్. జాస్మిన్ మరియు చెర్రీ కూడా సినిమాలో చాలా బాగా నటించారు. రాజేష్ కుమార్ మరియు రవీంద్ర కూడా తమ నటన లో కొత్తదనం చూపించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:
డైరెక్టర్ రాజేష్ ఎం సెల్వ ఈ సినిమా కోసం అద్భుతమైన కథను ఎంచుకున్నారు. అతని స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఏమాత్రం బోర్ కొట్టించకుండా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. అంతేకాకుండా దర్శకుడు కథను నెరేట్ చేసిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కథను ఏమాత్రం స్లో ఇవ్వకుండా సినిమా మొత్తం చాలా బాగా నడిపించారు దర్శకుడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ మరియు ఆర్ రవీంద్ర అందించిన నిర్మాణ విలువలు సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు. గిబ్రాన్ అందించిన సంగీతం సినిమాకి వెన్నెముక గా మారింది. పాటల సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి గిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫర్ శ్రీనివాస్ ఆర్ గుత్తా ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
ఒక బలమైన కథ ఉండటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దాదాపు అందరు నటీనటులకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టరైజేషన్ లు దక్కాయి అని చెప్పవచ్చు. మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ మరియు యాక్షన్ సన్నివేశాలు కథను మరింత బలపరిచాయి. ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఏమాత్రం బోర్ కొట్టించకుండా చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. నటీనటులు, కథ మరియు నేపథ్య సంగీతం ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ లుగా మారాయి. సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాల్లో తమిళ నేటివిటి ఎక్కువవడంతో తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవ్వలేక పోవచ్చు. చివరిగా ‘మిస్టర్ కేకే’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే మంచి థ్రిల్లర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -