Friday, March 29, 2024
- Advertisement -

కరోనా వల్ల అంబానీ ఆస్తి ఎంత పొగొట్టుకున్నాడో తెలుసా ?

- Advertisement -

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం నష్టపోయింది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ కరోనా షాక్ తగిలింది. ఈ వైరస్ పుణ్యమా అని.. ప్రపంచ కుబేరులకు సైతం వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలోనే టాప్ టెన్ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత అంబానీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది.

కరోనా కారణంగా మార్చి 31 నాటికి ముకేశ్ ఆస్తి విలువ దగ్గర దగ్గర 28 శాతం హరించుకుపోయినట్లుగా హురూన్ నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా చోటు చేసుకున్న పరిణామాలతో తగ్గిన షేర్ విలువతో రోజుకు 300 మిలియన్ డాలర్ల మేర తగ్గినట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి – మార్చి మధ్య ముకేశ్ సంపద ఏకంగా రూ.1.40లక్షల కోట్లు హరించుకుపోయినట్లు వెల్లడించింది. దాంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం తగ్గిపోయింది. ఆయన ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్నారు.

అంబానీ తర్వాత ఎక్కువ సంపద పొగొట్టుకున్న ఇతర భారతీయుల్లో గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన సంపదన ఆరు బిలియన్ డాలర్లు తగ్గినట్లు తెలుస్తోంది. హెచ్ సీఎల్ టెక్ శివ నాడార్ ఆస్తి విలువ ఐదు మిలియన్ డాలర్లు.. ఉదయ్ కోటక్ ఆస్తి విలువ నాలుగు బిలియన్ డాలర్ల మేర తగ్గినట్లుగా లెక్క కట్టారు. సో కరోనా దెబ్బ సామాన్యులకే కాదు కుబేరులకు కూడా భారీ షాకే ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -