Wednesday, April 24, 2024
- Advertisement -

జేడీయూ ఎఫెక్ట్…? వైసీపీకీ భాజాపా బంప‌ర్ ఆఫ‌ర్‌

- Advertisement -

పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావ‌డంతో ఎవ్వ‌రూ కూడా బ్లాక్ మేయిల్ చేసె ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా మోదీ స‌ర్కార్‌తో ఎలువంటి వివాదాల‌కు పోకుండా స‌ఖ్య‌త‌గా ఉండ‌టం వ‌ల్ల రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు అందిస్తోంది. ఇప్ప‌టికే పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం మాత్ర‌మే ఆదుకొగ‌ల‌దు,. అందుకే జ‌గ‌న్ కూడా క‌య్యానికి వెల్లకుండా స్నేహ‌పూర్వ‌కంగా ఉన్నారు.

ఇద‌లా ఉంటె మోదీ వైసీపీకీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌నె వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం రేపుతోంది.తాజాగా బీహార్‌లో బీజేపీ-జేడీయూ కూటమి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎన్డీయే నుంచి జేడీయూ దూరం జరగనుందనే ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో జేడీయూ తమకు దూరమైతే… ఆ స్థానాన్ని వైసీపీతో భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. అందులో భాగంగానె లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఆఫర్ చేసేందుకు బీజేపీ ముందుకొచ్చినట్టు స‌మాచారం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లను సాధించి సభలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు కేటాయించడం ఆనవాయితీ. గత లోక్‌సభలో ఈ పదవిని అన్నాడిఎంకెకు కేటాయించింది బీజేపీ. అన్నాడీఎంకెకు చెందిన తంబిదురై లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. అయితే దీనిపై వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనిపై వైఎస్ జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -