Thursday, April 25, 2024
- Advertisement -

ఆచార్య వచ్చే అసలు ట్విస్ట్ ను బయటపెట్టిన నిహారిక..!

- Advertisement -

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో తన 152 వ చిత్రం చేస్తున్న చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఈ సినిమా ఆచార్య అనే టైటిల్ పెట్టినట్లు చిరు ఇప్పటికే ప్రకటించారు. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత కాజల్ మరోసారి చిరంజీవికి జంటగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇంకా కన్‍ఫార్మ్ కాలేదు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో రాంచరణ్ అలాగే నిహారిక కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది. దీని పై నిహారిక తాజాగా క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఏకంగా కథ, ట్విస్ట్ లతో సహా బయటపెట్టేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇక నిహారిక చెప్పిన కథ ప్రకారం… గోవింద ఆచార్య (మెగాస్టార్) కంటే ముందే ఉద్యమం చేపట్టిన రాంచరణ్ ను కొందరు దుర్మార్గులు కుట్ర పన్ని రాంచరణ్ ను చంపేస్తారు.

ఆ కథ మొత్తం గోవింద (మెగాస్టార్) కు వివరించే రాంచరణ్ సోదరి పాత్రలో నిహారిక కనిపిస్తుందట. తర్వాత వారిపై కసితో పగ తీర్చుకుని ఆ దుండగులను సంహరిస్తాడు గోవింద. ఇదే మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు పండగ చేసుకునే ఎలెమెంట్స్ తో పాటు మంచి సామాజిక అంశంతో కూడిన మెసేజ్ కూడా ఉంటుందట. అయితే చరణ్ పాత్రకి ఓ హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -