కేసు నమోదు.. పరారీలో బండ్ల గణేశ్.. అసలు ఏమైంది ?

542
Police Search for Bandla Ganesh
Police Search for Bandla Ganesh

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదైంది. టాలీవుడ్ నిర్మాత పీవీపీతో అర్ధిక లావాదేవీల్లో గొడవ కారణంతో ఇది జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో బండ్ల గణేష్ అప్పట్లో టెంపర్ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రకరకాల గొడవలు అప్పట్లోనే ప్రముఖంగా చర్చకు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం.. టెంపర్ చిత్రానికి రూ.30కోట్ల పెట్టుబడిని పీవీపీ సర్ధుబాటు చేశారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ ముందు అసలు చెల్లించేశారు. కానీ దానిపై బ్యాలెన్స్ చెల్లించాల్సిన దానికి గణేష్ అప్పట్లోనే పీవీపీకి చెక్కులు ఇచ్చారు. ఆ మొత్తం ఇవ్వాల్సిందిగా బండ్ల గణేష్ ని పీవీపీ అడిగారట. అయితే డబ్బు ఇవ్వకపోవగా గణేష్ అనుచరులు పీవీపీని బెదిరించారట.

దాంతో పీవీపీ పోలీసులకు పిర్యాదు చేశారు. బండ్ల గణేష్, అతని అనుచరులపై 448-506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోసం పోలిసులు గాలిస్తున్నారు. గతంలో అర్దిక వ్యవహారాల్లో హీరో సచిన్ తో కూడా బండ్ల గణేష్ ఇలానే గొడవ పడిన విషయం తెలిసిందే.

Loading...