Friday, April 19, 2024
- Advertisement -

పునర్నవికి తండ్రి వార్నింగ్ ఇచ్చాడా.. ?

- Advertisement -

నటి పునర్నవి రెండు నెలలకుపైనే బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది. ఆమె బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ తో ఎక్కువగా క్లోజ్ గా ఉండేది. అతడిపై ప్రేమ మాటలు చూపిస్తూనే తిట్టేది. దాంతో వీరి మధ్య ఏదో ఉందని బాగా ప్రచారం జరిగింది. పునర్నవి ఎలిమినేట్ తర్వాత రాహుల్ బాగా ఏడ్చాడు. దాంతో చాలా మంది రాహుల్ ను చూసి బాధపడ్డారు. ఇద్దరు లవ్ లో ఉన్నారని అందరు అనుకున్నారు. కానీ అలాంటి వార్తలకు పునర్నవి పుల్ స్టాప్ పెట్టేసింది.

ఎలిమినేషన్ తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది. పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ’రాహుల్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అతడు నాకు చాలా క్లోజ్ అయ్యాడు. ఇంట్లో అందరికంటే రాహుల్ నాకు ఎక్కువ క్లోజ్ అవ్వడం, నేను అతడికి చాలా క్లోజ్ గా ఉండటం వల్లే’ ఈ పుకార్లు వచ్చాయని పునర్నవి చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఒక గేమ్ ను గేమ్ లా ఆడాం. మీమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే. రాహుల్ కూడా బయటకు వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్ లా ఉంటాడని ఆశిస్తున్నానని పునర్నవి చెప్పింది.

ఇక రాహుల్ విషయంలో ఎలాంటి ఫిలింగ్స్ తనకు ఉండవి.. అందరితో పాటే తనను చూస్తానని చెప్పింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ముద్దులుపెట్టుకోని క్లోజ్ గా ఉండి ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎలా అని, అంతేకాకుండా రాహుల్ తో క్లోజ్ గా ఉండటం ఆమె తండ్రికి నచ్చకపోవడం వల్లే ఇప్పుడు పునర్నవి రివర్స్ లో రాహుల్ కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొస్తుందంటూ సోషల్ మీడియాలో పుకర్లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -