Friday, March 29, 2024
- Advertisement -

రాహుల్, వరుణ్.. విన్నర్ పై పునర్నవి షాకింగ్ నిజం..!

- Advertisement -

బిగ్ బాస్ మూడో సీజన్ రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ఇంకా నాలుగు వారాలే ఉండటంతో హౌస్ లో ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారు అనే ఉత్కంఠ అందరిలో పెరిగిపోయింది. చివరి వారంలో నటి పునర్నవి ఎలిమినేట్ అయింది. ఆమె ఇంకా ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడం అందరికి పెద్ద షాక్.

ఇక బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి, రాహుల్, వరుణ్, వితిక బాగా క్లోజ్ ఉండేవారు. ఎవరితో ఎన్ని గొడవలు వచ్చిన.. సర్దిపోయి ఉండేది పునర్నవి. రాహుల్ తో అయితే లవ్ లో పడిపోయిందా అన్నంత క్లోజ్ గా ఉండేది. అయితే ఎలిమినేట్ అయ్యే వారంలోనే ఓ ఎపిసోడ్ లో రాహుల్ తో గొడవ పడి మాట్లాడం మానేసింది పునర్నవి. బయటకు వచ్చే ముందు కూడా రాహుల్ తో ఫోటో దిగిందేకు ఇష్టపడలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన పునర్నవి.. ఇప్పుడు రాహుల్, వరుణ్ కు సపోర్ట్ చేస్తోంది.

తన ఫ్రెండ్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ విన్నర్ అవుతారని చెబుతోంది. రాహుల్, వరుణ్ కు సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టింది. పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట అంటే వెంటనే రియాక్ట్ అయిపోయేది. బయటకు వచ్చిన తర్వాత రాహుల్, వరుణ్ లో ఎవరైన ఒకరు గెలవాలని తనకు తోచినంత పబ్లిసిటీ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -