రేవంత్ రెడ్డి : సీఎం ? డిప్యూటీ సీఎం ? హోం మినిస్టర్ ?

403
Revanth reddy postion After election
Revanth reddy postion After election

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ విజయం సాధిస్తే రేవంత్ రెడ్డిని ఏ పదవి వరించబోతోంది ? ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఇదే కీలక చర్చగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన కీలక వ్యాఖ్యలకు తోడు రేవంత్ రెడ్డి తాజా కామెంట్స్ అంతటా ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..రేపు రెవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా అవ్వవచ్చు. అంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు రేవంత్ వర్గీయుల్లో ఆనందం నింపితే, సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ సీనియర్లు, ఆశావహుల్లో అలజడి రేపుతున్నాయి.

మరోవైపు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు గట్టి సవాల్ విసిరారు. కొడంగల్ లో తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గం పేరు ఢిల్లీ స్థాయిలో వినిపించేలా చేసిన ఘతన తనదేనని రేవంత్ అంటున్నారు. తన నియోజకవర్గంలో ఎన్నికలు కొడంగల్ ప్రజల పౌరుషానికి, కేసీఆర్ కుటుంబానికి మధ్య యుద్ధంగా అభివర్ణిస్తూ రేవంత్ మీసం మెలేసి మరీ సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్ ఒక్కడి ఉద్యోగం ఊడగొడితే తెలంగాణ యువకులకు లక్ష ఉద్యోగాలు వస్తాయని రోడ్ షోలో ప్రచారం చేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి మరో కీలక వ్యాఖ్య చేశారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక తన పాత్ర మొదటి మూడు స్థానాల్లోనే ఉంటుందని చెప్పారు.

ప్రభుత్వంలో మొదటి మూడు స్థానాలు అంటే ఫస్ట్ సీఎం, రెండోది డిప్యూటీ సీఎం, మూడోది హోం మినిస్టర్. కనుక రేవంత్ రెడ్డి చెప్పిన మూడు స్థానాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, హోంమినిస్టర్ స్థానాలే కనిపిస్తున్నాయి. మరోవైపు గులాం నబీ ఆజాద్ కూడా రేవంత్ సీం అయినా అవ్వవచ్చు…అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ మొదటి మూడు స్థానాల్లో తన పాత్ర ఉంటుందని చెప్పడంతో ఆయన వర్గీయుల్లో ఆనందం అంబరమంటుతోంది. ఆ మూడు పదవుల్లో ఏదో ఒక పదవి కచ్చితంగా రేవంత్ ను వరిస్తుందని ఆశ పడుతున్నారు.