Wednesday, April 24, 2024
- Advertisement -

జియో వాడేవారికి షాకింగ్ న్యూస్.. ఇక డబ్బులు చెల్లించాల్సిందే..!

- Advertisement -

రిలయన్స్ నెట్ వర్క్ జియో ని తీసుకొచ్చి టెలికంలో కొత్త సంచలనం సృష్టించింది. ఓ ఏడాది పాటు ఉచిత సేవలు అందించింది. ఆ తర్వాత రకరకల ఆఫర్లతో వినియోగదారులను తమవైపు తిప్పుకున్నారు. ఇప్పుడు పది మందిలో ఆరుగురు జియోనే వాడుతున్నారు. ఆ రెంజ్ లో జియో ప్రభంజనం సృష్టించింది. అయితే ఇటివలే జియో నుంచి ఇతర నెటివర్క్ కు కాల్ చేసుకోవాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందే అని జియో ప్రకటించింది.

దాంతో ఇది వినియోగదారుల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభంకాగానే.. బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప నష్టాల్లోకి వెళ్లగా.. టెలికం కంపెనీల ఈక్విటీలు మాత్రం భారీగా లాభపడ్డాయి. జియో దారిలోనే ఎయిర్ టెల్ కూడా పయనిస్తుందన్న అంచనాలతో ఆ సంస్థ ఈక్విటీ ఏకంగా 6 శాతం పెరిగింది. ఇక వోడాఫోన్ ఐడియా ఏకంగా 15 శాతం లాభపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి. జియో మాదిరిగానే మిగతా అన్ని కంపెనీలు కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ పై చార్జీలను విధిస్తారని మార్కెట్ వర్గాలు నమ్మాయని, దీంతో ఇప్పటివరకూ నష్టాల్లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు కొంతమేరకు కోలుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఈ కారణంతోనే ఆయా కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు వచ్చిందన్నారు.

ఇదిలావుండగా, నేడు వెల్లడికానున్న టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు, ఆపై ఇన్ఫోసిస్ ఫలితాలు సమీప భవిష్యత్ లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని అంచనా. ఏది ఏమైన జియో వచ్చి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో.. అలానే ఇప్పుడు తమ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -