Wednesday, April 24, 2024
- Advertisement -

తల్లి కాబోతున్న బిగ్ బాస్ 2 ఫైనలిస్ట్

- Advertisement -

తన మధురమైన గాత్రం తో ఎన్నో ఏళ్ళ నుండి ప్రేక్షకులని, సంగీత ప్రియులని అలరిస్తూ వస్తుంది గాయని గీత మాధురి. దాదాపు గ పదేళ్ల ముందు సినిమా పరిశ్రమ లో అరంగేట్రం చేసిన గీత మాధురి క్రమక్రమం గా ఎదుగుతూ పెద్ద హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడి ఎనలేని పేరు ప్రఖ్యాతలు గడించింది. అయితే మూడేళ్ళ క్రితం హీరో నందూ ని ప్రేమించి వివాహమాడింది. ఆ తర్వాత బిగ్ బాస్ టీవీ షో లో కూడా పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచింది గీత. ప్రస్తుతం గీత మాధురి గర్భవతి. ఇటీవలే ఆమెకు సీమంతం వేడుక ని కూడా ఘనం గా నిర్వహించారు.

త్వరలో నే గీత-నందూ జంట ఒక కొత్త వ్యక్తి ని తమ కుటుంబం లో నికి ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని అధికారికం గా ఇద్దరూ ప్రకటించకపోయినా వారు షేర్ చేస్తున్న ఫొటోస్, వీడియోస్ ద్వారా ఈ విషయం క్లియర్ గా అందరికీ తెలుస్తుంది. ఇటీవలే కుటుంభం సభ్యులు, స్నేహితుల సమక్షం లో ఈ వేడుక ని ఘనం గా నిర్వహించారు. ఇకపోతే గత కొన్ని రోజులు గా గీత తన ఆరోగ్యం దృష్ట్యా తన కెరీర్ కి కొన్ని రోజులు పాజ్ ఇచ్చిందట.

బిడ్డ పుట్టాక మళ్ళి తిరిగి శ్రోతల్ని అలరించాలని ఆలోచన లో గీత ఉంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -