Wednesday, April 24, 2024
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇంతలా దిగాజరిపోతుందేంటి..?

- Advertisement -

ఎంతో ఘన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.. జాతీయంగా ఈ పార్టీ ఎంతో అయోమయంలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మరి రాష్ట్రాలలో అయినా ఈ పార్టీ గట్టిగా ఉందా అంటే అక్కడ కూడా అదే పరిస్థితి అన్న వాదన గట్టిగా వినపడుతుంది.. ముఖ్యంగా తెలంగాణా విషయంలో కాంగ్రెస్ రోజు రోజు కి దిగజారిపోతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కాంగ్రెస్ కి రాష్ట్రంలో ఎక్కువ బలం ఉండాలి.. కానీ అక్కడ పరిస్థితి వేరు.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అక్కడ చాలా బలంగా ఉంది..

కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే..పార్టీ ఒక్కటి చేతుల్లో ఎప్పుడు ఉండదు… వర్కింగ్ ప్రెసిడెంట్ నే అక్కడ అందరు నేతలు వేలెత్తి చూపుతారు. అయన మాట అంటే లెక్కే చేయరు.. పార్టీ లో సీనియర్ లకు, జూనియర్ లు సలాం కొట్టి పోవాలన్నా పంథా అక్కడున్తుంది.. దాంతో కామన్ గానే ఇరు పక్షాలకు అస్సలు పొసగలేదు.. అవికాస్త వీధిన పడడంతో కాంగ్రెస్ పరువు ఇంకాస్త పోతుంది.. వీరివల్ల ప్రజల్లో కాంగ్రెస్ మీద నమ్మకం రోజురోజు కి సడలిపోతుంది.. ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ లో బలంగా లేదంటే వారి అంతర్గత విభేదాలు ఎదుటివారిని ఎంత తోక్కేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు..

ప్రస్తుతం తెలంగాణ లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల హంగామా జోరందుకుంది.. ముఖ్యమంత్రి కూడా దీనిపై ఆసక్తికరంగా ఉన్నారు.. అయితే దీనిపై కాంగ్రెస్ సమావేశం నిర్వహించగా ఈ సమావేశం ఆగ్రహావేశాలకు, పెద్ద రభసకు దారి తీసింది.ధికార ప్రతినిధులైన దాసోజు శ్రవణ్, నిరంజన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.. ఒకరినొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇదే జరిగితే గ్రేటర్ లో కూడా గులాబీ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇప్పటికే వీక్ గా ఉన్న పార్టీ లో ఈ కుమ్ములాటలు పక్కకు పెట్టి బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -