Saturday, April 20, 2024
- Advertisement -

“సర్కార్ వారి పాట” సినిమా ని మహేష్ అందుకే ఒప్పుకున్నాడా..?

- Advertisement -

గత కొన్ని సినిమాలు గా మహేష్ తన సినిమాలలో చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారని తెలుస్తుంది.. ఒక జోనర్ కథ చేస్తే మళ్ళీ అదే జోనర్ కథ చేయడానికి ఎక్కువగా ఇష్టపడడంలేదు.. ఇటీవలే కామెడీ కి ఎక్కువ గా ఆస్కారం ఉన్న సరిలేరు నెవ్వరు సినిమా నే దానికి ఉదాహరణ.. గతంలో మహేష్ కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడం చాలా తక్కువ. ఎప్పుడు మూస పద్ధతి లో పోవడం ఎందుకంటే అయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అనుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా మహేష్ చేస్తున్నాడు. సుకుమార్ సినిమా ని కాదని మరీ పరశురామ్ చెప్పిన కథను చేస్తున్నాడు.. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ని కాదని మహేష్ ఈ సినిమా చేయడం పట్ల అభిమానులు ఈ సినిమా కథ ఏ రేంజ్ ఓ ఉందో అనుకున్నటున్నారు.. ఇక పరశురామ్ కి కూడా పెద్ద ట్రాక్ రికార్డు లేదు..తొలి సినిమా సోలో  హిట్ కొట్టినా ఆ తర్వాత పెద్ద గా సినిమాలు చేయలేదు. మళ్ళీ గీత గోవిందం తో ట్రాక్ లోకి వచ్చాడు.. అయితే రీ ఎంట్రీ లో హిట్ కొట్టడంతో పాటు మహేష్ సినిమా ని కొట్టేయడంతో పరశురామ్ లో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్య పడుతున్నారు.

ఇక ఈ సినిమా కి సంభందించి ఫస్ట్ లుక్ ఇటీవలే వచ్చింది.. మహేష్ ఫాన్స్ కి అది మంచి కిక్ ఇచ్చింది. మహేష్ ని పోకిరి లో చుసిన విధంగా మరోసారి చూడబోతున్నామని వారికి ఇప్పటికే అర్థమయ్యింది.. అయితే ఈ సినిమా లో అదొక్కటే కాదు మరొక షేడ్ కూడా ఉందని యూనిట్ చెప్తుంది.. దీంతో మహేష్ ఈ సినిమా లో రెండు షేడ్స్ ల్లో కనిపించబోతున్నాడని వార్తలు షికార్లు చేస్తున్నాయి.. ఏదైతేనేం మహేష్ బాబు ఈ సినిమా తో మళ్ళీ హిట్ రెడీ అవుతున్నాడని ఫాన్స్  చెప్తున్నారు.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -