Wednesday, April 24, 2024
- Advertisement -

కొత్త హామీలేమీ ఇవ్వకుండా ఐదేళ్ళ పాలన చూసి ఓటెయ్యమన్న వైఎస్ ఎక్కడ?

- Advertisement -

ఐదేళ్ళుగా ప్రపంచ దేశాలన్నీ ప్రజల డబ్బులతో తిరిగి, అంతర్జాతీయ రాజధాని, స్మార్ట్ సిటీలు అంటూ ఐదేళ్ళలో ఏ ఒక్క రోజూ మిస్సవ్వకుండా మీడియా ముందు ఊదరగొట్టాడు. మీడియాలో పబ్లిసిటీ కోసం ప్రయత్నించని రోజంటూ ఏదీ లేదు. ఇక ప్రపంచ దేశాధ్యక్షులందరూ పొగుడుతున్నారు. రాష్ట్రాల నాయకులందరూ భజన చేస్తున్నారు అంటూ పచ్చ మీడియా డప్పు. ఇక ఈ ఎన్నికల వేళ కూడా ఆహా……..ఓహో………ఓహోహో…..అంటూ అనుక్షణం ఆత్మసాక్షిని చంపుకుంటూ ప్రచారం చేస్తున్న రాజగురువు, ఓపెన్ హార్ట్ సర్జన్‌లాంటి ఎంతో మంది సీనియర్, జూనియర్ జర్నలిస్టులు. అయితేనేం ఏ ఒక్కరూ కూడా ఐదేళ్ళ బాబు పాలన చూసి ఓటెయ్యండి అని చెప్పే ధైర్యం చెయ్యలేకపోతున్నారు. స్వయంగా చంద్రబాబు కూడా ఆ మాట చెప్పలేని పరిస్థితి. అధికారంలో లేని ప్రతిపక్ష నాయకుడిలా వరాల వర్షం కురిపిస్తున్నాడు. గెలిపిస్తే అది చేస్తా……ఇది చేస్తా అంటూ హామీలిస్తున్నాడు. ఈ ఐదేళ్ళలో అవన్నీ చెయ్యకుండా ఏం చేస్తున్నావ్ అని నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం బాబుకు లేదు.

ఇప్పుడు కాసేపు వైఎస్ పాలనా కాలం టైంకి వెళదాం. ఐదేళ్ళ పాలన తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చాడు వైఎస్. అత్యధిక సంఖ్యలో ఎంపిలను గెలిపించే బాధ్యత నాది………మీరు ఎపి ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు అని అధిష్టానానికి చెప్పి అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించడం నుంచీ ప్రచారం వరకూ అన్నీ తానై చూసుకున్నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి. మహాకూటమి అంటూ చంద్రబాబు, కేసీఆర్, సిపిఐ, సిపిఎంలతో సహా అందరూ కలిసి పోటీచేసినప్పటికీ వైఎస్ భయపడలేదు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళందరూ కలిసి వందల్లో హామీలు ఇస్తున్నప్పటికీ అధికారంలో ఉన్న వైఎస్ కూడా ప్రజలకు సరికొత్త హామీలు ఇవ్వాలని తాపత్రయపడలేదు. చిరంజీవి, ఎన్టీఆర్‌లాంటి స్టార్స్ ప్రచారంలో ప్రజలను ఆకర్షించినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం తన పాలనే తనను గెలిపిస్తుందని వంద శాతం నమ్మాడు. అన్నింటికీ మించి సీమాంధ్రులను తిట్టాడు అని ఇప్పుడు చంద్రబాబు ఎవరి గురించి అయితే వాపోతున్నాడు…………సీమాంధ్ర ఆత్మగౌరవం అంటూ ఎవరికి వ్యతిరేకంగా ఎపి ప్రజలను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నాడో ఆ నాయకుడు కేసీఆర్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నప్పటికీ……..తెలంగాణాకు అనుకూలంగా మహానాడులో తీర్మానాలు, తెలంగాణా ఏర్పాటు చెయ్యాల్సిందే అని చెప్పి లేేఖలు ఇచ్చి చంద్రబాబే స్వయంగా డిమాండ్ చేసినప్పటికీ తెలంగాణాలో కూడా తనదే విజయం, తన పాలనకే తెలంగాణా ప్రజలు ఓట్లు వేస్తారు అని వైఎస్ భరోసాగా ఉన్నారు.

అదీ గొప్ప పాలన అందించిన ఒక పాలకుడి లక్షణం. నాయకుడికి ఉండాల్సిన స్థైర్యం. హామీలు ఇవ్వకుండానే, వరాల వర్షం కురిపిించకుండానే తెలంగాణాతో సహా తెలుగు ప్రజలందరి మనసూ గెల్చుకుని మళ్ళీ సిఎం అయ్యాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.

ఇప్పుడు ఐదేళ్ళ పాలన తర్వాత ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు, కేఎ పాల్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో పాటు శివాజీ లాంటి పెయిర్ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు, ప్రతిపక్షంలో ఉన్న జగన్‌కంటే ఎక్కువగా హామీలు ఇస్తున్న చంద్రబాబు వైనం……………అన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? వైఎస్ రాజశేఖరరెడ్డికి చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అర్థమవుతోందా? గొప్పగా పాలించిన నాయకుడికి ప్రజలపై ఉండే నమ్మకం, ధైర్యం ఎలా ఉంటుందో? కేవలం మీడియా పబ్లిసిటీ, గ్రాఫిక్స్‌ని నమ్ముకుని పూర్తిగా ప్రజలను మోసం చేసిన నాయకుడు ఎంతలా భయపడతాడో తెలుస్తోందా? వైఎస్ రాజశేఖరరెడ్డికి చంద్రబాబుకు ఉన్న తేడా అర్థమవుతోందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -