Thursday, April 25, 2024
- Advertisement -

రోజా, ఆళ్ల‌కు జ‌గ‌న్ నుంచి పిలుపు… సాయంత్రం జ‌గ‌న్‌తో భేటీ…

- Advertisement -

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌దువ‌లు ద‌క్క‌ని నేత‌లు రోజా, ఆళ్ల అసంతృప్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో వారు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. బినెట్‌లో ఏ కారణాలతో చోటు కల్పించలేకపోయారో జగన్ , ఆళ్ల‌కు రెండు దఫాలు వివరించారు. కాని వారు అసంతృప్తిని వీడ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ఫోన్ చేశారు. వెంట‌నే అమ‌రావ‌తికి వ‌చ్చి త‌న‌ను క‌ల‌వాల‌ని సూచించారు.

మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించిన రోజా… మంత్రి పదవి రాకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మంత్రి వ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకారానికి రాకుండా వారు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కేబినెట్ భేటీ అనంతరం ఈ అంశంపై దృష్టి పెట్టినట్టు కనిపించిన ఏపీ సీఎం వైఎస్ జగన్… ఆమెను అమరావతి రావాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో రోజా హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తి బ‌య‌లు దేరిన‌ట్లు తెలుస్తోంది.

కేబినేట్‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని రోజాకు ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే పార్టీ కోసం కష్టపడిన తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న రోజా… వైఎస్ జగన్ ఆఫర్ చేయబోయే నామినేటెడ్ పదవిని స్వీకరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మ‌రో వైపు ఆర్టీసీ ఛైర్మెన్ ప‌ద‌వి కాకుంటే ఏపీ రాష్ట్ర మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పదవిని రోజాకు కట్టబెట్టాలని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

మరోవైపు రెండున్నరేళ్ల తరువాత కేబినెట్‌లోని 90శాతం మంత్రులను మారుస్తానని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్… అప్పుడు మంత్రి పదవి ఇస్తానని రోజాకు హామీ ఇచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటివరకు తాను ఇచ్చే నామినేటెడ్ పదవిలో కొనసాగాలని సీఎం జగన్ రోజాను కోరితే ఆమె కొనసాగే ఛాన్స్ ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

మరోవైపు మంగళగిరి నుండి రెండో దఫా విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడ జగన్‌ను కలవాలని వైసీపీ నేతలు ఫోన్ చేశారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కుతోందని భావించారు. కాని ఆయ‌న‌కు కూడా అదృష్టం వ‌రించ‌లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని బుజ్జగించేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే జగన్ ను కలవాలని ఫోన్ చేశారు. సాయంత్ర నాలుగు గంట‌ల‌కు జ‌గ‌న్ తో భేటీ కానున్నారు. భేటీలో ఇద్ద‌రికి సీఎం ఎలాంటి హామీలు స్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -