Thursday, April 25, 2024
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్లో జోష్…ఆ ఎంపీకి ఆర్థిక శాఖ‌

- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈసారి రాష్ట్రంలో అధికార మార్పిడి ఖాయం అని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తేల్చాయి. మొద‌టి నుంచి ఆపార్టీనేత‌లు గెలుపుపై ధీమాతో ఉన్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. జగన్ మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారన్న అంశాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి

ఆర్థిక శాఖ‌ను జ‌గ‌న్ ఎవ‌రికి కేటాయిస్తార‌నేది ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ తరఫున ఢిల్లీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న విజయసాయిరెడ్డికి ఆర్థిక శాఖ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అయితే విజ‌య‌సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయసాయిని కూడా ఎమ్మెల్సీని చేసి ఆర్థిక శాఖను అప్పగిస్తారని పార్టీలో చర్చ నడుస్తోంది.

ఆర్థిక శాఖ‌తో పాటు ఎంతో కీల‌క‌మైన స్పీకర్ ప‌ద‌విని ద‌గ్గుపాటి వెంకటేశ్వరరావుకు ఇస్తారని, ఒకవేళ ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్సీని చేసి ఆ పదవిని అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. మ‌రో వైపు అంబ‌టి కూడా స్పీక‌ర్ రేసులో ఉన్నారు. హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు ఊహాగానాల్లో తేలియాడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -