కాస్టింగ్ కౌచ్ పై నందినీ రాయ్ కి కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి

561
Sri Reddy Counters On Nandini Rai Casting Couch Responce
Sri Reddy Counters On Nandini Rai Casting Couch Responce

శ్రీరెడ్డి మరోసారి తనదైన స్టైల్ లో యంగ్ హీరోయిన్ నందినీ రాయ్ పై పంచ్ వేసింది. కాస్టింగ్ కౌచ్ పై నందినీ స్పందన చూసిన శ్రీరెడ్డి.. అసలు ముందు కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో తెలుసుకో బుజ్జీ అని ఆమెకు కౌంటర్ చ్చింది. ఇటీవలే ఓ మీడియాతో ముచ్చటించిన బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్.. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదని ఐటీ కంపెనీలు సహా ఎక్కడైనా ఉందని చెప్పింది.

”వాళ్లను అడిగారు.. వీళ్లను అడిగారు అని ఇండస్ట్రీ గురించి చాలా మంది అంటుంటారు. నిజానికి అలా ఏం ఉండదు. అడిగేవాళ్లు అడుగుతారు. యస్ చెప్పడమా.. నో చెప్పడమా అనేది ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది. అది అమ్మాయి ఇష్టం. వెళ్లాలి అనుకుంటే వెళ్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి ఇష్టం లేకపోతే నో చెప్తుంది” అని పేర్కొంది నందినీ. నందినీ స్పందనపై శ్రీరెడ్డి వెంటనే స్పందించి కౌంటర్ ఇచ్చింది. ముందు కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటో అర్దం తెలుసుకో అనేలా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టిసింది.

“అవకాశం కోసం ఓ అమ్మాయి వచ్చినప్పుడు.. ఎవరైనా ఆమెను సెక్స్ కోసం బలవంతం చేస్తే అది కాస్టింగ్ కౌచ్ అవుతుంది నందిని. అలా కాకుండా అమ్మాయి డైరెక్టుగా నిర్మాతకు సెక్స్ ఆఫర్ చేస్తే అది కాస్టింగ్ కౌచ్ కాదు. అది నీకు బాగా తెలుసని నేను నమ్ముతున్నా మై ఫ్రెండ్” అంటూ తన సందేశాన్ని పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని రచ్చ చేసిన శ్రీరెడ్డి.. అప్పట్లో అర్దనగ్నంగా తన నిరసన తెలియజేసి సంచలనం రేపింది. అయితే ఇండస్ట్రిలో కాస్టింగ్ కౌచ్ ఉందని కొందరు అంటే కొందరు లేదని అని అంటున్నారు.

Loading...