Friday, April 19, 2024
- Advertisement -

బాలయ్యకు బర్త్ డే విష్ చేస్తూ మెగా ఫ్యామిలీని తిట్టిన శ్రీరెడ్డి..!

- Advertisement -

బాలకృష్ణ పుట్టినరోజున వివాదాల శ్రీ రెడ్డి ఒక స్పెషల్ కామెంట్ చేసింది. ఏ విషయంపై ఆమె మాట్లాడిన మెగా ఫ్యామిలీని మాత్రం పక్కా టార్గెట్ చేస్తోంది. బాలకృష్ణ బర్త్ డే విషెస్ డిఫరెంట్ చేసింది శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి బానే ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక హీరో అభిమానులను రెచ్చగొట్టేలా శ్రీరెడ్డి పోస్టులు పెడుతోంది. ఎప్పుడు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తోంది.

అయితే బాలకృష్ణకు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇండస్ట్రీ సింహా స్వప్న, నట రత్న, తెలుగు ప్రియ.. మంచి మానవత్వం ఉన్న సోషల్ సర్వీస్.. ఆయనకు పద్మ శ్రీ అవసరం లేదు. ఆయన నవ్వే ఒక పెద్ద అవార్డ్. లివింగ్ లెజెండ్ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలుపుతూ.. ఆయన వ్యక్తిత్వం గురించి శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. అలాగే తన పోస్ట్ లో మెగా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసింది.

ప్రేమతో చెంప మీద కొడతావ్ తప్ప.. మెగా ఫ్యామిలీ లాగా కడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం గురించి ఆలోచించే ముద్దుల మామయ్య మా బాలయ్య అంటూ శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ పుట్టినరోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో చాలానే ట్రెండ్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యపై వారికున్న అభిమానాన్ని, ప్రేమను ట్వీట్స్ ద్వారా తెలియజేశారు.

చిరు ఇంట్లో జరిగిన 80స్ క్లబ్ రీ యూనియన్ కి నన్ను పిలవలేదు :…

జగన్ తో భేటీకి రానని చెప్పిన బాలయ్య.. కారణం ఇదే..!

నాగబాబు పై ఫైర్ అయిన ఎన్టీఆర్.. ఎందుకు ?

కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -