Friday, April 19, 2024
- Advertisement -

హీరోయిన్ గా యాంకర్ సుమ ఎలా ఉందో చూడండి

- Advertisement -

యాంకర్ సుమకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆమెకు అన్ని భాషల్లో మంచి పట్టు ఉంది. తెలుగు అమ్మాయి కానప్పటికి తెలుగువారి కన్న అద్భుతంగా మాట్లాడుతుంది. ఇప్పటికే ఎన్నో షోస్ చేసింది. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. అయినప్పటికి స్టార్ యాంకర్ గానే దూసుకెళ్తోంది.

నెంబర్ వన్ యాంకర్ ఎవరంటే ఎవరైన వెంటనే చెప్పేది సుమ పేరే. ఆమెతో పాటు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వారు చాలా మంది కనిపించకుండా పోయారు. సుమ మాత్రం యంగ్ జనరేషన్ కి కూడా పోటీ ఇస్తోంది. సుమ తన కెరీర్ నటిగా మొదలుపెట్టడం విశేషం. 1991 నుండి అనేక మలయాళ చిత్రాలలో ప్రాధాన్యం లేని రోల్స్ ఆమె చేశారు. ఐతే 1996లో దర్శకుడు దాసరి నారాయణరావు తెరకెక్కించిన కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా తరువాత ఆమె మరో మలయాళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. తెలుగులో 1997లో వచ్చిన హార్రర్ సీరియల్ అన్వేషిత ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాల్లో కొన్ని పాత్రలు చేసిన సుమ.. యాంకరింగ్ రంగంవైపు వచ్చి సక్సెస్ అయింది. 90లలో హీరోయిన్ గా అవకాశాల కోసం ట్రై చేసిన టైంలో తీసుకున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1999లో సుమ నటుడు రాజీవ్ కనకాలను లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరి మామగారు దేవదాస్ కనకాల కూడా నటుడే కావడం విశేషం. ఆయన గత ఏడాది మరణించారు.

పవన్ తో చేయడం లేదు.. కానీ మహేష్ సినిమా చేస్తా : రేణు దేశాయ్

నయనతార, హన్సిక లతో విడిపోవడం కారణం చెప్పిన శింబు..!

నాకు చాలా మందితో ఎఫైర్ ఉంది : లక్ష్మీ రాయ్

నా లైఫ్ లో అనసూయకు ప్రత్యేక స్థానం : హైపర్ ఆది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -